iDreamPost

సినీ రాజకీయం ఆఖరి ఘట్టం

సినీ రాజకీయం ఆఖరి ఘట్టం

ఏదో వందల కోట్ల భారీ బడ్జెట్ సినిమా విడుదల కోసం ఎదురు చూసినట్టు మీడియాతో సహా ఇప్పుడు సామాన్య జనం కూడా మా అసోసియేషన్ ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్నారు. గత పది రోజులుగా తారాస్థాయికి చేరిన ప్రకాష్ రాజ్, మంచు విష్ణు వర్గాల పరస్పర దూషణలు, ఆరోపణలు, కౌంటర్లు, ప్రెస్ మీట్ల రచ్చ మాములుగా జరగడం లేదు. దానికి తోడు రోజుకో మలుపు తిరుగుతున్న ఈ పరిణామాలను న్యూస్ ఛానల్స్ బ్రహ్మాండంగా వాడుకుంటున్నాయి. ప్రధాన పోటీదారులందరూ ప్రచారం కోసం లైవ్ డిబేట్లలో పాల్గొనడంతో సోషల్ మీడియాకూ మంచి స్టఫ్ దొరికింది. ట్రోలింగ్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోంది.

నిన్న నాగబాబు ఓ వీడియో వదిలి అందులో ప్రకాష్ రాజ్ కు ఎందుకు ఓటు వేయాలి విష్ణుని తానెందుకు వ్యతిరేకిస్తున్నది చెప్పడం ఆల్రెడీ వైరల్ అయ్యింది. సలీం బ్యాలన్స్ పేమెంట్ గురించి దర్శకుడు వైవిఎస్ చౌదరి కోర్టుకు వెళ్లడాన్ని ప్రస్తావించడం ఎవరూ ఊహించనిది. ఇంతకు ముందు పోటీకి నిలబడి విత్ డ్రా చేసుకున్న ఆర్టిస్టు సివిఎల్ నరసింహారావు ఈ ఎన్నిక ఏకగ్రీవం కానందుకు ఏకంగా మా సభ్యత్వానికి రాజీనామా చేయడం మరో ట్విస్టు. జీవిత ఇప్పటికే రెండు మూడు ప్రెస్ మీట్లు పెట్టేశారు. మంచు విష్ణు కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ టీవీ స్టూడియోలకు వెళ్లి తనకు ఓపికున్నంత పార్టిసిపేషన్ ఇస్తున్నాడు.

సరే ఇంతా చేసి రేపు పోల్ కాబోయే ఓట్లు 500 లోపే ఉంటాయనే షాకింగ్ న్యూస్ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. తొమ్మిది వందలకు పైగా సభ్యత్వం ఉన్నా కూడా రకరకాల కారణాల వల్ల పోస్టల్ బ్యాలెట్ కు అందుబాటులో లేని వాళ్ళు, షూటింగ్స్ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అవుట్ డోర్ కు వెళ్ళినవాళ్ళు, రెన్యూవల్ చేసుకోని వాళ్ళు ఇలా మొత్తం లెక్క చూసుకుంటే అరటన్ను సభ్యులు కూడా ఓటు వేయకపోవచ్చని అంటున్నారు. దీనికా ఇంత హంగామా అని కామెంట్లు చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. ,మొత్తానికి అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ రేంజ్ లో హడావిడి చేసిన మా కుర్చీ మీద కూర్చునేదెవరో ఎల్లుండి తేలిపోతుంది

Also Read : ఆరడుగుల బుల్లెట్ రిపోర్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి