iDreamPost

30 ఏళ్ళ క్రితం బాలయ్య చేసిన కథ! ఇప్పుడు అక్షయ్ తో మళ్లీ..

  • Author ajaykrishna Published - 09:10 AM, Thu - 7 September 23
  • Author ajaykrishna Published - 09:10 AM, Thu - 7 September 23
30 ఏళ్ళ క్రితం బాలయ్య చేసిన కథ! ఇప్పుడు అక్షయ్ తో మళ్లీ..

ఇండస్ట్రీలో సినిమాలను పోలిన సినిమాలు తెరపైకి వస్తూనే ఉంటాయి. ఒకే ఇన్సిడెంట్ పై వేర్వేరు భాషలలో సినిమాలు తెరకెక్కిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అలాంటి విషయమే దాదాపు ముప్పై ఏళ్ళ తర్వాత రిపీట్ అవుతున్నట్లు తెలుస్తోంది. 30 ఏళ్ల క్రితం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఓ రియల్ ఇన్సిడెంట్ స్టోరీతో.. ఇప్పుడు బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిస్తున్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం! 1993లో బాలయ్య హీరోగా కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో ‘నిప్పు రవ్వ’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాని నిర్మిస్తూనే విజయశాంతి హీరోయిన్ గాను నటించింది.

ఇక నిప్పురవ్వ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ గురించి పక్కన పెడితే.. ఆ సినిమా కథ 1989లో రాణిగంజ్ బొగ్గు గనుల్లో జరిగిన విషాద సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. రాణిగంజ్ ఘటనకు తెలంగాణ బ్యాక్ డ్రాప్ జోడించి కమర్షియల్ ఎలిమెంట్స్ తో నిప్పు రవ్వని రూపొందించారు. ఇప్పుడదే రాణిగంజ్ ఘటనతోనే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా ‘మిషన్ రాణిగంజ్’ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అక్షయ్ కుమార్ కి రుస్తుం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు టిను సురేష్ దేశాయ్.. ఈ మిషన్ రాణిగంజ్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇదిలా ఉండగా.. ఈ సినిమా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఇప్పుడీ మిషన్ రాణిగంజ్ లో ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా చాలా రియలిస్టిక్ గా తెరకెక్కిస్తున్నారని సమాచారం. కథాంశం విషయానికి వస్తే.. రాణిగంజ్ బొగ్గు గనుల్లో 220 మంది కార్మికులు తవ్వకాలలో ఉండగా.. నీరు వచ్చి గనులను ముంచేసింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించగా.. 68 మందిని కాపాడారు. ముప్పై ఏళ్ళ కిందట బాలయ్య నిప్పురవ్వ కాన్సెప్ట్ కూడా ఇదే. మరి ఇప్పుడు అదే కథాంశంతో అక్షయ్ కుమార్ మిషన్ రాణిగంజ్ చేస్తున్నాడు. ఈసారి ఈ సూపర్ హిట్ రుస్తుం కాంబినేషన్ ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. ఆ విధంగా బాలయ్య కథనే అక్షయ్ మళ్లీ చేస్తున్నాడని నెటిజన్స్ అంటున్నారు. మరి మిషన్ రాణిగంజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి