iDreamPost

కింగ్ మనసు అందుకే మారింది

కింగ్ మనసు అందుకే మారింది

కింగ్ అక్కినేని నాగార్జున త్వరలో ఓటిటి సినిమా చేయడం దాదాపు ఖాయమే. ఏ దర్శకుడు, టీమ్ ఏంటి, ప్లాట్ ఫార్మ్ ఏది లాంటి వివరాలు ఇంకా బయటికి రాలేదు కానీ చేసే ఆలోచన ఉందన్న విషయం స్వయంగా ఆయనే ఒప్పుకోవడంతో ఇప్పుడిది టాపిక్ గా మారింది. నిజానికి లాక్ డౌన్ టైం లో వైల్డ్ డాగ్ ని డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ ఈలోగా థియేటర్లు తెరుచుకోవడంతో నెట్ ఫ్లిక్స్ తో డీల్ క్యాన్సిల్ చేసుకుని హాళ్లలో విడుదల చేశారు. ఆఫ్ కోర్స్ దానికి తగ్గ ఫలితం రాలేదు అది వేరే సంగతి. ఇప్పుడు నాగార్జున ఇంత బలంగా ఓటిటి మూవీ చేయాలని అనుకోవడం వెనుక కారణం ఏమై ఉంటుందా అనే సందేహం రావడం సహజం. అదెందుకో చూద్దాం.

గత ఏడాదికి పైగా ఓటిటి మంచి బూమ్ లో ఉంది. ఇది పెరగడమే కానీ తగ్గే అవకాశాలు లేవు. వెబ్ సిరీస్ లకు బ్రహ్మాండమైన ఆదరణ దక్కుతోంది. వీటి సంస్థలు కోట్లాది రూపాయలు బడ్జెట్ ని కేటాయిస్తున్నారు. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, మాధవన్, జాన్వీ కపూర్, కియారా అద్వానీ లాంటి స్టార్లు సైతం వీటిలో నటిస్తున్నారు. సినిమాలకు ధీటుగా పారితోషికాలు అందుతున్నాయి. సెన్సార్ ఇబ్బందులు లేవు. డిస్ట్రిబ్యూషన్ సమస్యలు రావు. పెట్టుబడికి గ్యారెంటీ ఉంటుంది. అందుకే కరణ్ జోహార్ లాంటి అగ్ర దర్శక నిర్మాతలు సైతం వీటి వైపు మొగ్గు చూపుతున్నారు

వీటి భవిషత్తుని అంచనా వేసే నాగ్ ఓటిటికి ఓకే చెప్పి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి తోడు మునుపటిలా ఇప్పుడు కింగ్ మార్కెట్ లేదు. ఓపెనింగ్స్ కూడా భారీగా రావడం లేదు. హిట్టు ఫట్టు సంగతి పక్కనపెడితే షిరిడి సాయితో మొదలుపెట్టి నిన్నటి వైల్డ్ డాగ్ దాకా ఓపెనింగ్స్ కూడా నిరాశాజనకంగా వచ్చాయి. ఒక్క సోగ్గాడే చిన్ని నాయన మాత్రమే కెరీర్ బెస్ట్ గా నిలిచింది తప్ప ఊపిరి సైతం పెద్దగా లాభాలు ఇవ్వలేదు. అందుకే ఫ్యూచర్ బ్రైట్ గా కనిపిస్తున్న ఓటిటి వైపు నాగార్జున లాంటి సీనియర్ అడుగులు వేయడం ఆహ్వానించాల్సిన పరిణామమే. ఇంకెందరు ఈ బాటలో వస్తారో చూడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి