iDreamPost

Air Indiaలో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు.. త్వరగా అప్లై చేసుకోండి

డిగ్రీ చదివినా ఉద్యోగాలు లేవని బాధపడుతున్నారా? మీలాంటి వారికి గుడ్ న్యూస్. ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్‌ లిమిటెడ్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆ వివరాలు మీకోసం..

డిగ్రీ చదివినా ఉద్యోగాలు లేవని బాధపడుతున్నారా? మీలాంటి వారికి గుడ్ న్యూస్. ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్‌ లిమిటెడ్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆ వివరాలు మీకోసం..

Air Indiaలో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు.. త్వరగా అప్లై చేసుకోండి

మీరు డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎప్పటి నుంచో సన్నద్ధమవుతున్నారా? అయితే మీలాంటి వారికి ఓ శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందే అవకాశం వచ్చింది. ఎయిర్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మీరు ఈ ఉద్యోగాలను సాధించి లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. ఏ నోటిఫికేషన్ ను వదిలినా దీనిని మాత్రం వదిలిపెట్టొద్దు. డిగ్రీ అర్హతతోనే ఈ ఉద్యోగాలకు పోటీపడొచ్చు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా అప్లై చేసుకోండి.

ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్‌ లిమిటెడ్‌ లో ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన అసిస్టెంట్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 209పోస్టులను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్ లో 10 ఖాళీలున్నాయి. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో జనవరి 15 2024 వరకు అప్లై చేసుకునేందుకు వీలు కల్పించారు. దరఖాస్తు చేసుకోదలచిన వారు పూర్తి సమాచారం కోసం ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్‌ లిమిటెడ్‌ అధికారిక వెబ్ సైట్ https://www.aiesl.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

  • అసిస్టెంట్ సూపర్‌వైజర్ మొత్తం పోస్టులు
  • 209

ఏఐఈఎస్‌ఎల్‌ ఇంజినీరింగ్ యాక్టివిటీ సెంటర్లవారీగా ఖాళీలు:

  • ఢిల్లీ-87, ముంబయి-70, కోల్‌కతా-12, హైదరాబాద్-10, నాగ్‌పుర్-10, తిరువనంతపురం-20.

అర్హత:

  • మూడేళ్ల గ్రాడ్యుయేషన్ బీఎస్సీ/ బీకాం/ బీఏ, కంప్యూటర్‌ సర్టిఫికేట్ కోర్సుతో పాటు డేటా ఎంట్రీ/కంప్యూటర్ అప్లికేషన్‌లలో ఏడాది పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • 01.01.2024 నాటికి జనరల్ అభ్యర్థులు 35 సంవత్సరాలకు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులు 38 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 40 ఏళ్లకు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు రూ.1000 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. బ్యాంకులో ఆర్టీజీఎస్ / నెఫ్ట్ ఆధారితంగా ఫీజు చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

  • ఈమెయిల్ careers@aiesl.in ద్వారా దరఖాస్తు స్కాన్డ్ కాపీ, ఇతర కాపీలు జతచేసి పంపాలి. అదేవిధంగా గూగుల్ ఫామ్ ఆన్‌లైన్ దరఖాస్తును పూర్తిచేయాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం:

  • అభ్యర్థులను రాత పరీక్ష/ స్కిల్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.27,000 అందిస్తారు.

దరఖాస్తుకు చివరితేదీ:

  • 15-01-2024.

ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్‌ లిమిటెడ్‌ అధికారిక వెబ్ సైట్:

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి