iDreamPost

Shivam Dube: సిక్సులతో టీమిండియా కుర్రాళ్ల ఊచకోత! దూబే బ్యాట్‌ చెకింగ్‌!

  • Published Jan 15, 2024 | 2:06 PMUpdated Jan 15, 2024 | 2:06 PM

టీమిండియా యువ క్రికెటర్‌ శివమ్‌ దూబే.. ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో చెలరేగి ఆడుతున్నాడు. తొలి మ్యాచ్‌లో 60 కొట్టిన దూబే.. రెండో మ్యాచ్‌లో 63 పరుగులతో సత్తా చాటాడు. దీంతో అతని బ్యాట్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా యువ క్రికెటర్‌ శివమ్‌ దూబే.. ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో చెలరేగి ఆడుతున్నాడు. తొలి మ్యాచ్‌లో 60 కొట్టిన దూబే.. రెండో మ్యాచ్‌లో 63 పరుగులతో సత్తా చాటాడు. దీంతో అతని బ్యాట్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jan 15, 2024 | 2:06 PMUpdated Jan 15, 2024 | 2:06 PM
Shivam Dube: సిక్సులతో టీమిండియా కుర్రాళ్ల ఊచకోత! దూబే బ్యాట్‌ చెకింగ్‌!

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య ఇండోర్‌ వేదికగా రెండో టీ20 మ్యాచ్‌ అద్భుతంగా జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తమ ఆధిపత్య​ం ప్రదర్శిస్తూ.. ఆఫ్ఘాన్‌ను చిత్తుగా ఓడించింది. బౌలింగ్‌లో కాస్త తేలిపోయినా.. బ్యాటింగ్‌లో టీమిండియా పూర్తిగా డామినేట్‌ చేసింది. ముఖ్యంగా యువ క్రికెటర్లు టీ20 ఫార్మాట్‌ అంటే తమదే అన్నట్లు రెచ్చిపోయి ఆడారు. రోహిత్‌ శర్మ మరోసారి విఫలమైనా.. కోహ్లీ కొద్దిసేపే మెరుపులు మెరిపించినా.. యంగ్‌ గన్స్‌ యశస్వి జైస్వాల్‌, శివమ్‌ దూబే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి బ్యాటింగ్‌ చేశారు. సిక్సులతో ఆఫ్ఘాన్‌ బౌలర్లను ఊచకోత కోశారు. వారి షాట్లకు డగౌట్‌లో కూర్చున్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ సైతం షాక్‌ అయ్యారు.

రోహిత్‌ శర్మ గోల్డెన్‌ డక్‌ అయిన తర్వాత.. క్రీజ్‌లోకి వచ్చిన విరాట్‌ కోహ్లీ వేగంగా ఆడాడు. పవర్‌ ప్లేలో కోహ్లీ-జైస్వాల్‌ జోడీ పరుగుల వదర పారించింది. అయితే.. కోహ్లీ 16 బంతుల్లో 29 రన్స్‌ చేసి అవుటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శివమ్‌ దూబే.. అదే టెంపోను కొనసాగించాడు. జైస్వాల్‌-దూబే జోడి ఆఫ్ఘాన్‌ బౌలర్లపై పూర్తి డామినేషన్‌ చూపించింది. ఎదురుగా ఏ బౌలర్‌ ఉన్నా సరే బాదడమే పనిగా పెట్టుకున్నారు ఈ ఇద్దరు కుర్రాళ్లు. వీరి దూకుడు ముందు.. టీ20 క్రికెట్‌లో ఎంతో అనుభవం ఉన్న ఆఫ్ఘాన్‌ మోస్ట్‌ సీనియర్‌ బౌలర్‌ మొహమ్మద్‌ నబీ సైతం తేలిపోయాడు. నబీ వేసిన వేసిన ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌లో అయితే దూబే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

ఆ ఓవర్‌లో దూబే ఏకంగా మూడు వరుస సిక్సులతో నబీని ఒకరకంగా భయపెట్టాడు. మొత్తం 32 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సులతో 63 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి, టీమిండియాకు సిరీస్‌ విజయాన్ని అందించాడు. మూడు మ్యాచ్లో సిరీస్‌ను టీమిండియా 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. అయితే.. ఈ మ్యాచ్‌లో దూబే ఆడిన షాట్లకు ఆఫ్ఘాన్‌ ఆటగాళ్లు షాక్‌ అయినట్లు ఉన్నారు. మ్యాచ్‌ ముగిసి డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్తున్న క్రమంలో దూబే బ్యాట్‌ తీసుకోని చెక్‌ చేశారు. ఇంత సులువగా, అంత భారీ షాట్లు ఎలా కొడుతున్నావ్‌ అంటూ దూబే బ్యాట్‌ చూస్తూ సరదాగా ఆఫ్గాన్‌ ఆటగాళ్లు అడిగినట్లు తెలుస్తోంది. మరి దూబే ఆడిన ఇన్నింగ్స్‌తో పాటు, అఫ్ఘాన్‌ ఆటగాళ్లు దూబే బ్యాట్‌ను చెక్‌ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి