iDreamPost

వీడియో: స్టార్ క్రికెటర్ గొప్ప మనసు! అర్ధరాత్రి బిచ్చగాళ్లకి సాయం

  • Published Nov 12, 2023 | 11:56 AMUpdated Nov 12, 2023 | 11:56 AM

దీపావళి పండుగను నిరుపేదలకు కూడా ఎంతో సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో అర్ధరాత్రి ఓ స్టార్‌ క్రికెటర్‌ రోడ్లపై తిరుగుతూ.. రోడ్డు పక్కన నిద్రిస్తున్న బిచ్చగాళ్లకు డబ్బులు ఇవ్వడం విశేషం. మరి ఆ స్టార్‌ క్రికెటర్‌ ఎవరు? ఎక్కడ డబ్బులు పంచాడో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో ఆఫ్ఘనిస్థాన్‌ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబర్చి అందరి ప్రశంసలు అందుకుంది. 9 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో అంచనాలకు మించి రాణించి, క్రికెట్‌ అభిమానుల మనసులు గెల్చుకుంది. ఇప్పుడు ఆ జట్టు స్టార్‌ ఆటగాడు రహమనుల్లా గుర్బాజ్‌ చేసిన పనితో నెటిజన్స్‌ ఫిదా అయిపోయారు. వరల్డ్‌ కప్‌లో ఆస్ట్రేలియాతో చివరి మ్యాచ్‌ ఆడేసిన తర్వాత.. ఆఫ్ఘాన్‌ జట్టు స్వదేశానికి వెళ్లేందుకు సిద్దంగా ఉంది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు గుర్బాజ్‌ అహ్మదాబాద్‌ రోడ్లపై తిరుగుతూ.. రోడ్లపై నిద్రిస్తున్న యాజకులకు డబ్బులు పంచారు. వాళ్లు కూడా దీపావళి పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో గుర్బాజ్‌ ఇలా చేసినట్లు సమాచారం.

మన దేశంలో విలాసవంతమైన జీవితాలతో దుర్భరమైన జీవితం గడిపే వాళ్లు ఉన్నారు. కానీ, పండుగ సమయంలో అందరు ఎంతో సంతోషంగా గడపాలి అనుకుంటారు. అయితే, అందరి దగ్గరపూట గడవడానికే డబ్బు ఉండదు, ఇంకా పండగలు ఎలా చేసుకోగలరు. అలాంటి కొంతమంది జీవితంలో కనీసం దీపావళి రోజైన కాంతులు విరియాలని గుర్బాజ్‌ ఎంతో మంచి పని చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో పాటు గుర్బాజ్‌ ఐపీఎల్‌లోనూ ఆడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఇండియాతో అతనికి మంచి అనుబంధం ఏర్పడింది. అలాగే ఆఫ్ఘనిస్థాన్‌లో కూడా పేదరికం విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే.

అక్కడి దుర్భర పరిస్థితులు చూసి చలించిపోయిన గుర్బాజ్‌.. పేదలకు ఎంతో కొంత సాయం చేసే గుణం అతనికి అలవడింది. ఆఫ్ఘనిస్థాన్‌లో పేదల కోసం ఆ జట్టు స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ ఓ ఫౌండేషన్‌ను కూడా నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ ఫౌండేషన్‌కు సైతం గుర్బాజ్‌తో మరికొంత మంది డోనేషన్లు ఇచ్చారు. ఇప్పుడు ఇండియాలో దీపావళి పండుగ సందర్భంగా కొంతమంది పేదలకు గుర్బాజ్‌ డబ్బుల పంచడం, వాళ్లు కూడా పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సోషల్‌ మీడియాలో నెటిజన్లు గుర్బాజ్‌ను ప్రశంసిస్తున్నారు. మరి గుర్బాజ్‌ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి