iDreamPost

మేజర్ – మరో ప్యాన్ ఇండియా టార్గెట్

మేజర్ – మరో ప్యాన్ ఇండియా టార్గెట్

థియేటర్లు కళకళలాడాలంటే సౌత్ సినిమాలు తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయిన బాలీవుడ్ కు జూన్ 3న రాబోతున్న మేజర్ కూడా అదే కోవలోకి వచ్చేలా కనిపిస్తోంది. మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అడవి శేష్ టైటిల్ రోల్ పోషించిన ఈ బయోపిక్ కి గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకుడు. సోనీ సంస్థతో పాటు మహేష్ బాబు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన ఈ మూవీ ట్రైలర్ ని నిన్న గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన మేజర్ ఎట్టకేలకు జూన్ 3న రాబోతోంది. ఇకపై డేట్ లో ఎలాంటి మార్పు లేనట్టే. అక్షయ్ కుమార్ పృథ్విరాజ్ బరిలో ఉన్నప్పటికీ ఈ నిర్ణయంలో వెనక్కు తగ్గరని అర్థమైపోయింది.

ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2ల బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత హిందీ సినిమాలు గడ్డు పరిస్థితిని ఎదురుకుంటున్నాయి. సాదాసీదా లేదా యావరేజ్ కంటెంట్ ని స్టార్ లు ఉన్నా సరే నార్త్ ఆడియన్స్ తిరస్కరిస్తున్నారు. దానికి నిదర్శనమే హీరోపంటి 2, రన్ వే 34 ఫలితాలు. ఎంత ప్రమోషన్ చేసినా ఇవి కనీస స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోయాయి. అజయ్ దేవగన్, అమితాబ్ బచ్చన్, టైగర్ శ్రోఫ్ లాంటి క్యాస్టింగ్ ఉన్నా లాభం లేకపోయింది. దెబ్బకు కెజిఎఫ్ 2కు మళ్ళీ వసూళ్లు పెరగగా ఆర్ఆర్ఆర్ కు వీకెండ్స్ హౌస్ ఫుల్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో వస్తున్న మేజర్ మీద ఇప్పటికే ముంబై మీడియాకు మంచి సాఫ్ట్ కార్నర్ వచ్చేసింది.

ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది. చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేని తాజ్ హోటల్ మీద టెర్రరిస్టుల ఎటాక్ ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకున్నప్పటికీ ఉన్నికృష్ణన్ సాధించిన కొన్ని కీలక విజయాలను కూడా ఇందులో చూపించబోతున్నారు. ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ పాటు కన్నీళ్లు తెప్పించే ఎమోషన్ కూడా ఉంటుందని యూనిట్ చెబుతున్న మాట నిజమనిపించేలా ట్రైలర్ ఉంది. కాకపోతే ఇంత సీరియస్ డ్రామాలో రొమాంటిక్ సీన్లు ఎందుకు పెట్టారన్న కామెంట్స్ లేకపోలేదు. మొత్తానికి అడవి శేష్ కనక దీంతో హిట్ కొడితే బాలీవుడ్ దర్శక నిర్మాతల దృష్టిలో పడి ప్యాన్ ఇండియా అవకాశాలను పెంచుకునే ఛాన్స్ ఉంటుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి