iDreamPost

రజినీ, కమల్ లాంటి స్టార్స్ తో సినిమాలు చేసిన హీరోయిన్! చివరికి ఎయిడ్స్ తో..

  • Author ajaykrishna Published - 03:38 PM, Wed - 12 July 23
  • Author ajaykrishna Published - 03:38 PM, Wed - 12 July 23
రజినీ, కమల్ లాంటి స్టార్స్ తో సినిమాలు చేసిన హీరోయిన్! చివరికి ఎయిడ్స్ తో..

సినిమా అంటేనే మాయప్రపంచం. ఎప్పుడు ఎవరిని స్టార్ ని చేస్తుందో.. ఎవరిని పాతాలానికి పాతేస్తుందో ఎవరు అంచనా వేయలేరు. స్టార్స్ గా వెలిగిన వారే.. ఒక్కోసారి అవకాశాల కోసం కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి. అసలు అవకాశాలు లేక ఖాళీగా ఉన్నవారు చేతినిండా సినిమాలతో బిజీ అయ్యే దృశ్యాలు. కొన్నిసార్లు నమ్మడానికి కష్టంగా అనిపించినా.. రంగుల ప్రపంచంలో అన్ని జరుగుతాయి. కొన్ని అలా ఎలా జరిగాయని అడగకూడదు.. కొంతమంది ఎందుకు కనిపించకుండా పోయారని ఆరా తీయకూడదు.. ఇంకొందరికి ఎందుకి దుస్థితి వచ్చిందని జాలి పడకూడదు. ప్రతీ సక్సెస్ లో, ఫెయిల్యూర్ లో ఖచ్చితంగా కాస్తో కూస్తో సొంత ప్రమేయం ఉంటుంది.

కెరీర్ లో ఎదిగినా.. కనిపించకుండా పోయినా తప్పు రెండు వైపులా ఉండవచ్చు. అలాగని తప్పు చేయకుండానే పరిస్థితి మారుతుందని కూడా చెప్పలేం. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా.. రజినీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి స్టార్స్ సరసన సినిమాలు చేసిన నిషా నూర్ మీకు తెలియకపోవచ్చు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం సినిమాలలో మంచి స్టార్డమ్ సంపాదించుకున్న నిషా నూర్.. కొన్నాళ్ళు ఇండస్ట్రీలో లేకుండా పోయింది.. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఎయిడ్స్ వ్యాధి సోకి మరణించింది. ఇవన్నీ ఎవరికైనా తెలుసా! ఫేమ్ లో ఉన్నప్పుడు అందరూ వెంట తిరుగుతారు. ఒక్కసారి వెనకబడ్డాక ఎవరూ చేయూతనివ్వరు. నిషా నూర్ లైఫ్ లో ఇదే జరిగింది.

1962 సెప్టెంబర్ 18న తమిళనాడులోని నాగపట్నంలో నిషా నూర్ జన్మించారు. 18వ ఏట ‘మంగళ నాయగి’ అనే మూవీతో కెరీర్ ఆరంభించింది. 20 ఏళ్లు దాటాక తన గ్లామర్ తో ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ సొంతం చేసుకొని.. సౌత్ లోని అన్ని భాషల్లో నటించింది. గ్లామర్ హీరోయిన్ గా పైన చెప్పుకున్న స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేసింది. కమల్‌ తో ‘టిక్ టిక్ టిక్’.. రాజేంద్ర ప్రసాద్ తో ‘ఇనిమై ఇదో ఇదో’.. మమ్ముట్టితో ‘అయ్యర్ ది గ్రేట్’.. మోహన్ లాల్‌ తో ‘దేవసురమ్’ లాంటి హిట్ మూవీస్ చేసింది నూర్. తన అందంతో కుర్రకారును ఫిదా చేసిన నిషా.. 1995 కి వచ్చేసరికి చేతిలో అవకాశాలు లేకుండా అయిపోయింది.

స్టార్డమ్ చూసినా.. ఆ స్థాయిని కాపాడుకోలేకపోయింది. సినిమా అవకాశాల కోసం ప్రయత్నించి.. ఆఖరికి లాభం లేదని.. బతకడం కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంది. ఏ మార్గం లేక వ్యభిచారంలో అడుగుపెట్టింది. ఓ నిర్మాత బలవంతం వల్లనే ఆ వృత్తిలోకి దిగిందని టాక్ ఉంది. కొంతకాలనికి ఊహించని విధంగా ఆమెకు ఎయిడ్స్ సోకింది. కనీసం తలదాచుకోవడానికి స్థలం లేక ఓ దర్గా బయట నిద్రపోయేదని తెలుస్తుంది. అప్పటికే మనిషి అంతా బక్కచిక్కి క్షీనించి పోవడంతో.. గుర్తించలేని విధంగా మారిపోయింది. అలాంటి స్థితిలో తమిళనాడుకు చెందిన ఓ ఎన్జివో ఆమెను చేరదీసి మెడికల్ టెస్టులు చేయించగా.. ఎయిడ్స్ సోకిందని తెలిసింది. ఆ వ్యాధితో పోరాడుతూ నూర్.. 2007లో ఏప్రిల్ 23న కన్నుమూసింది. ఇది ఒక స్టార్ లైఫ్ స్టోరీ. మరి నిషా నూర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి