iDreamPost

ఛాన్సులు లేక ఆ పని చేయాల్సి వచ్చింది.. నటి సంచలన కామెంట్స్

Actress Mallika Jagula Comments: సినిమాల్లో ఒక్క ఛాన్సు వస్తే చాలు జీవితం మొత్తం మారిపోతుంది.. సమాజంలో సెలబ్రెటీ హోదా లభిస్తుందని ఎంతోమంది యువత ఆలోచిస్తుంటారు. సినిమా ఛాన్సుల కోసం స్టూడియోల చుట్టూ పడిగాపులు కాస్తుంటారు.

Actress Mallika Jagula Comments: సినిమాల్లో ఒక్క ఛాన్సు వస్తే చాలు జీవితం మొత్తం మారిపోతుంది.. సమాజంలో సెలబ్రెటీ హోదా లభిస్తుందని ఎంతోమంది యువత ఆలోచిస్తుంటారు. సినిమా ఛాన్సుల కోసం స్టూడియోల చుట్టూ పడిగాపులు కాస్తుంటారు.

ఛాన్సులు లేక ఆ పని చేయాల్సి వచ్చింది.. నటి సంచలన కామెంట్స్

సినిమా అంటే ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ ఒక్కసారి ఛాన్స్ దొరికితే లైఫ్ స్టైల్ మారిపోతుందని అందరూ భావిస్తుంటారు. అందుకోసం స్టూడియోల చుట్టూ చక్కర్లు కొడుతుంటారు. అదృష్టం కొద్ది ఎవరికో ఒకరికి ఛాన్స్ దొరుకుతుంది. ఇండస్ట్రీ అంటేనే క్యాస్టింగ్ కౌచ్. చిన్న క్యారెక్టర్ పాత్రల్లో నటించేవారి దగ్గ నుంచి స్టార్ హీరోయిన్ల వరకు కాస్టింగ్ కౌచ్ భారిన పడ్డవారే. మీటూ ఉద్యమం వచ్చిన తర్వాత చాలా మంది నటీమణులు గతంలో తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  తాజాగా ఓ నటి క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..

మల్లిక జాగుల ఈ పేరు వినగానే బుల్లితెరపై విలన్  పాత్రలు గుర్తుకు వస్తాయి. ప్రస్తుతం ఆమె సీరియల్స్ లో కూడా కనిపించడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో పడ్డ కష్టాల గురించి తెలిపింది. ఈ మద్య సినిమా నిర్మాతలు, దర్శకులు కన్నడ, మలయాల, హిందీ ఇండస్ట్రికి చెందిన నటీనటులను తెచ్చుకుంటున్నారు. తెలుగు వాళ్లను అస్సలు పట్టించుకోవడం లేదు. చాలా కాలంగా నాకు సినిమా ఛాన్సులు రాలేదు అందుకే డిప్రేషన్ లోకి వెళ్లిపోయాను. అదే సమయంలో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. కనీసం నిలబడే స్థితిలో లేకపోవడంతో హాస్పిటల్ జాయిన్ చేశారు. ఒకదశలో నేను చచ్చి బతికాను అని ఆవేదన వ్యక్తం చేశారు.

Had to do that work without any chance

సినిమా ఇండస్ట్రీ అంటే చాలా మంది ఓ రంగుల ప్రపంచం అనుకుంటారు.. కానీ ఇక్కడ ఉండే కష్టాలు ఇక్కడ ఉంటాయి. ముఖ్యంగా నటీమణులకు ఇదో ముళ్ల జీవితం అని చెప్పాలి. బాగున్నంత వరకు అంతా ఒకే.. ఏదైనా తేడా వచ్చిందంటే కష్టాలు చుట్టుముట్టేస్తాయి. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కి ఎంతోమంది యువతులు తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటీమణులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొని ఉంటారు. నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే. కరోనా తర్వాత చాలా కష్టాలు పడ్డాను. అవకాశాలు లేక చీరలు అమ్మాను. ఇండస్ట్రీలో 19 ఏళ్ల అనుభవం ఉన్నా.. నన్ను చూసిన వారే లేకుండా పోయారు.

ఇక వేరే ఏదైనా పని చేద్దామని వెళ్తే అవమానాలు, చులకనగా చూడటం మొదలు పెట్టారు. అప్పట్లో నేను ఎక్కువగా వ్యాంప్ క్యారెక్టర్స్ చేయడం ఒక కారణం అయి ఉండవొచ్చు. కెరీర్ లో అలాంటి పాత్రలే ఎక్కువ వచ్చాయి.. తప్పని పరిస్థితుల్లో నటించాల్సి వచ్చేది. నన్ను కొంతమంది కమిట్ మెంట్ అడిగారు.. కానీ నేను ఒప్పుకోలేదు. నెల రోజులు టార్చర్ పెట్టారు. సినిమాలు లేకుండా చేశారు. అయినా నేను తగ్గలేదు.. తర్వాత సీరియల్స్ లో వరుస ఛాన్సులు వచ్చాయి. నేనేంటో ప్రూవ్ చేసుకున్నాను. నేను ఒళ్లు అమ్ముకోలేదు.. ఒళ్ళు చూపించను అంతే అని చెప్పుకొచ్చారు మల్లిక జాగుల. ప్రస్తుతం మల్లిక మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి