iDreamPost

నటి గాయత్రి సంచలన వ్యాఖ్యలు.. సాయి రాజేష్‌ పాము లాంటి వాడు.. నన్ను మోసం చేశాడు

  • Published May 30, 2024 | 12:31 PMUpdated May 30, 2024 | 12:56 PM

Gayatri Sen Gupta: టాలీవుడ్‌ నటి గాయత్రి గుప్తా సంచలన వ్యాఖ్యలు చేసింది. బేబీ సినిమా దర్శకుడు సాయి రాజేష్‌ పాము లాంటి వాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు..

Gayatri Sen Gupta: టాలీవుడ్‌ నటి గాయత్రి గుప్తా సంచలన వ్యాఖ్యలు చేసింది. బేబీ సినిమా దర్శకుడు సాయి రాజేష్‌ పాము లాంటి వాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు..

  • Published May 30, 2024 | 12:31 PMUpdated May 30, 2024 | 12:56 PM
నటి గాయత్రి సంచలన వ్యాఖ్యలు.. సాయి రాజేష్‌ పాము లాంటి వాడు.. నన్ను మోసం చేశాడు

నటి గాయత్రి గుప్తా.. ఫిదా సినిమాలో సాయి పల్లవి ఫ్రెండ్‌గా యాక్ట్‌ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొబ్బరి మట్ట, ఐస్‌క్రీమ్‌ 2, మిఠాయి లాంటి చిత్రాల్లో నటించింది. సినిమాలతో కన్నా వివాదాలతో బాగా పాపురల్‌ అయ్యింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందని.. అవకాశాల కోసం బెడ్‌ రిలేషన్‌ పెట్టుకుంటారని చెప్పుకొచ్చింది. అలానే తనకు అనారగ్యో సమస్యలు ఉన్నాయిని.. చికిత్సకు భారీగా ఖర్చవుతుందని. కానీ ఏ ఒక్కరు ఆదుకోవడానికి ముందుకు రాలేదని వాపోయింది. ఈ క్రమంలోనే తాజాగా బేబీ సినిమా డైరెక్టర్‌ సాయి రాజేష్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అతడు పాము లాంటి వాడిన.. తాను అతడి చేతిలో మోసపోయానని చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..

గతేడాది విడుదలైన బేబీ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే విడుదలైన నాటి నుంచి ఈ సినిమాను వివాదాలు వదలడం లేదు. బేబీ సినిమా కథ తనదే అంటూ షార్ట్‌ ఫిలిం డైరెక్టర్‌, సినిమాటోగ్రాఫర్‌ శిరిన్‌ శ్రీరామ్‌ గత కొన్నిరోజులుగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ కథ మొత్తం తనదే అంటూ ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేశ్‌ బేబి సినిమా తీశాడని దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంపై సాక్ష్యాల‌తో స‌హా సాయి రాజేష్ మీద ‘బేబీ లీక్స్’ అనే బుక్‌ను వెబ్‌సైట్‌లో https://babyleaks2023.blogspot.com/ అందుబాటులోకి తీసుకొచ్చాడు శిరిన్‌.

Gayathri

బేబీ సినిమా డైరెక్టర్‌ సాయి రాజేష్ చేసిన మోసం, దానికి సంబంధించిన సాక్ష్యాలను బేబీ లీక్స్ అంటూ పుస్తకరూపంలో తీసుకొచ్చారు. ఈ బేబీ లీక్స్ బుక్‌ను మీడియా ముందుంచారు. అయితే, తాజాగా ఈ అంశంపై గాయత్రి గుప్తా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. సాయి రాజేష్‌ తనను కూడా మోసం చేశాడని.. బేబీ సినిమాలో ముందు తననే హీరోయిన్‌గా అనుకున్నారంటూ సంచలన విషయాలు వెల్లడించింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘బేబీ సినిమా కథను ప్రేమించొద్దు అనే పేరుతో శిరిన్‌ శ్రీరామ్‌ రాసుకున్నారు. దానిని సాయి రాజేష్‌ కాపీ కొట్టేశాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ముందు నన్నే అనుకున్నారు. ఆడిషన్‌ కూడా జరిగింది. స్కూల్‌ డ్రెస్‌లో ఉన్న ఆ ఫోటోలను సాయి రాజేష్‌కు చూపించాను. దానినే అతడు బేబీ సినిమాలో కాపీ కొట్టాడు. ట్రైలర్‌ విడుదల అయ్యాక చూసి నేను షాక్‌ అయ్యాను. సాయి రాజేష్‌తో ఇబ్బందులు నాకు కొత్త కాదు. ఆయన డైరెక్ట్‌ చేసిన కొబ్బరిమట్ట సినిమాలో కూడా నన్ను ఇబ్బంది పెట్టాడు’’ అని చెప్పుకొచ్చింది.

‘‘కొబ్బరి మట్ట సినిమాకు సంబంధించి ముందు నాకు రూ. 3లక్షలు ఇస్తానన్నారు. కానీ, కేవలం రూ.25 వేలు ఇచ్చి బాగా టార్చర్‌ పెట్టారు. సరేలే అని వదిలేశాను. బేబీ కథను మొదట రాసుకుంది శిరిన్‌. కానీ, సాయి రాజేష్‌ మాత్రం ఆ కథను తానే క్రియేట్‌ చేశానంటాడు. ఇద్దరూ కలిసి ఆ కథతో సినిమా తీద్దామని అనుకున్నారు. కానీ చివరి క్షణంలో బడ్జెట్‌ లేదని తెలివిగా శిరిన్‌ను తప్పించాడు. అదే కథను శిరిన్‌ నుంచి సాయి రాజేష్‌ కాపీ కొట్టేసి.. గీతా ఆర్ట్స్‌లో చర్చలు జరిపి.. సినిమా తీసి రిలీజ్‌ చేశాడు’’ అని చెప్పుకొచ్చింది.

‘‘గీతా ఆర్ట్స్‌ సంస్థ చాలా మంచిది. కానీ సాయి రాజేష్‌ పాము లాంటి వాడని వారు గుర్తించాలి. బేబీ సినిమా కోసం సాయి రాజేష్‌ చాలా చీప్‌ ట్రిక్స్‌ చేశాడు. బేబీ పాత్రను చాలా దారుణంగా చూపించాడు. కొందరైతే హీరోయిన్‌ పోస్టర్‌ను చెప్పులతో కూడా కొట్టారు. అంతలా ఆయన పబ్లిసిటీని ఉపయోగించుకున్నాడు. సాయి రాజేష్‌ లాంటి వ్యక్తి టాలీవుడ్‌కు మచ్చలా మిగిలిపోతాడు. బేబీ కథ రాసుకున్న శిరిన్‌ శ్రీరామ్‌కు న్యాయం జరిగాలి అని కోరుకుంటున్నాను’’ అన్నది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి