iDreamPost

ఆ స్టార్ డైరెక్టర్ నా పీరియడ్స్ డేట్ అడిగాడు! నటి షాకింగ్ కామెంట్స్..

  • Author Soma Sekhar Published - 06:18 PM, Thu - 6 July 23
  • Author Soma Sekhar Published - 06:18 PM, Thu - 6 July 23
ఆ స్టార్ డైరెక్టర్ నా పీరియడ్స్ డేట్ అడిగాడు! నటి షాకింగ్ కామెంట్స్..

సినిమా ఇండస్ట్రీలో హీరోలపై, డైరెక్టర్లపై కొంతమంది మహిళా నటులు షాకింగ్ కామెంట్స్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. అదీకాక షూటింగ్ సమయంలో తమకు ఎదరైన చేదు అనుభవాను సందర్బం వచ్చినప్పుడు బయటపెడుతుంటారు నటీమణులు. తాజాగా లస్ట్ స్టోరీస్ 2లో రెండో కథలో పనిమనిషి క్యారెక్టర్ చేసిన నటి అమృత సుభాష్ స్టార్ డైరెక్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు.. అనురాగ్ కశ్యప్. అవును అనురాగ్ కశ్యప్ నా పీరియడ్స్ డేట్ ఎప్పుడో చెప్పు అంటూ అడిగాడని షాకింగ్ కామెంట్స్ చేసింది అమృత సుభాస్.

అమృత సుభాస్.. ఓపక్క సినిమాలు, మరోపక్క వెబ్ సిరీస్ లతో మంచి జోరుమీదుంది ఈ బాలీవుడ్ బ్యూటి. తాజాగా ద మిర్రర్, లస్ట్ స్టోరీస్ 2 లో నటించిన అమృత సుభాస్.. ఈ మధ్య తనకు షూటింగ్ లో ఎదురైన సంఘటన గురించి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అమృత సుభాష్.. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాక్రెడ్ గేమ్స్ సిరీస్ 2లో నటిస్తోంది. ఈ క్రమంలోనే ఈ సిరీస్ షూటింగ్ టైమ్ లో జరిగిన ఆసక్తికర విషయాలను వివరించింది. ఈ సిరీస్ లో తొలిసారి శృంగార సన్నివేశాల్లో నటించానని, ఈ సీన్స్ షూట్ చేయడానికి ముందు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఆమెను ఓ ప్రశ్న అడిగారని చెప్పుకొచ్చింది.

అనురాగ్ కశ్యప్.. నీ పీరియడ్స్ డేట్ ఎప్పుడు? అని అడిగారు. దాంతో ఆమె షాక్ కు గురైయ్యానని తెలిపింది. కొద్ది క్షణాలపాటు ఆమెకు ఏమీ అర్ధం కాలేదని పేర్కొంది. అయితే.. అనురాగ్ కశ్యప్ ఉద్దేశం ఏంటంటే? ఆమె పీరియడ్స్ డేట్ ఎప్పుడో చెప్తే.. ఇంటిమేట్ సీన్స్ ను ఆరోజుల్లో కాకుండా ఇతర రోజుల్లో షూట్ చేస్తానని అతడు చెప్పాడట. తన డైరెక్షన్ టీమ్ తో మాట్లాడి షెడ్యూల్ లో మార్పులు చేశాడట అనురాగ్. దాంతో అనురాగ్ పై ప్రశంసలు కురిపించింది అమృత సుభాష్. అతడు చాలా మృదుస్వభావి అని, నటీ, నటులను ఎంతగానో అర్ధం చేసుకుంటాడని చెప్పుకొచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి