iDreamPost

స్టార్ హీరోయిన్ తో విశాల్ పెళ్లి? ఆమె ఎవరంటే?

  • Author Soma Sekhar Updated - 03:59 PM, Tue - 8 August 23
  • Author Soma Sekhar Updated - 03:59 PM, Tue - 8 August 23
స్టార్ హీరోయిన్ తో విశాల్ పెళ్లి? ఆమె ఎవరంటే?

సినిమా ఇండస్ట్రీలో డేటింగ్ వార్తలకు, పెళ్లి వార్తలకు కొదవ ఉండదు. ఇక ఒక సినిమాలో కలిసి నటించిన హీరో, హీరోయిన్ ఏ రెస్టారెంట్ లోనో.. లేదా ఏ పార్టీలోని కనిపిస్తే చాలు వారిద్దరు ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే తర్వాత కాలంలో కొన్ని జంటల విషయంలో ఈ వార్తలు నిజమని తేలిన సంఘటనలు ఇండస్ట్రీలో మనం చాలానే చూశాం. ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరోయిన్ ను విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. మరి విశాల్ పెళ్లి చేసుకోబోయే ఆ స్టార్ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

విశాల్.. అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో ప్రేక్షకులను సంపాదించుకుని వరుస సినిమాలు చేస్తూ.. బిజీగా ఉన్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ లో ముందుకెళ్తున్నాడు యాక్టర్ విశాల్. కాగా.. విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కోలీవుడ్ లో వార్త వైరల్ గా మారింది. కోలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగొందిన లక్ష్మీ మీనన్ ను విశాల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ అక్కడి సినీ పరిశ్రమలో టాక్ నడుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాకపోవడంతో.. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది. ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే.. విశాల్, లక్ష్మీ మీనన్ లో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.

vishal marriage with star heroine 2

కాగా.. విశాల్, లక్ష్మీ మీనన్ కలిసి పాండియనాడు(పల్నాడు), ఇంద్రుడు చిత్రాల్లో నటించారు. ఈ రెండు సినిమాల్లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. కాగా.. అప్పట్లో ఈ వార్తలపై వారు ఇద్దరూ స్పందించలేదు. ఈ క్రమంలోనే త్వరలోనే వీరు పెళ్లి చేసుకోవాలని అనుకుని పెద్దలకు తెలియజేయడంతో.. ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారిందని పరిశ్రమ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ప్రస్తుతం లక్ష్మీ మీనన్ చంద్రముఖి 2 చిత్రంలో నటిస్తోంది. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఆమె సినిమా చేస్తోంది. మరి పెళ్లి వార్తలపై విశాల్ ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాలి.

ఇదికూడా చదవండి: ఆరోజు లైలా చేసిన పనికి చనిపోయేవాళ్లం.. అందుకే ఆమెను కొట్టాను: జేడీ చక్రవర్తి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి