iDreamPost

అభిమాని మృతితో కన్నీరు పెట్టుకున్న సూర్య!

అభిమాని మృతితో కన్నీరు పెట్టుకున్న సూర్య!

సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లకు వీరాభిమానులు ఉంటారు. తమ అభిమాన హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే థఇయేటర్ల వద్ద పెద్ద హంగామా చేస్తుంటారు. పెద్ద పెద్ద కటౌట్స్ ఏర్పాటు చేసి.. పాలభిషేకం చేస్తుంటారు. అభిమానులు అంటే రక్తం పంచుకోకుండా పుట్టిన గొప్ప ఆత్మీయులు అంటారు హీరోలు. తమ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్దపడతారని.. వాళ్ల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని అంటారు. అలాంటి అభిమానులకు ఏ చిన్న కష్టం వచ్చినా స్వయంగా వెళ్లి ఓదారుస్తుంటారు. తాజాగా తన అభిమాన హీరో చనిపోయాడని.. స్టార్ హీరో సూర్య కన్నీళ్లు పెట్టుకున్నాడు.

స్టార్ హీరో సూర్య వీరాభిమాని అయిన అరవింద్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ విషయం గురించి ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా  తెలుసుకున్న హీరో సూర్య చెన్నైలోని ఎన్నూర్ లో ఉన్న అరవింద్ ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ఓదార్చాడు. అరవింద్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించాడు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నాడు సూర్య. అరవింద్ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చాడు.

ఈ సందర్బంగా సూర్య మాట్లాడుతూ.. ‘సూర్య ఫ్యాన్ క్లబ్ సభ్యుడిగా అరవింద్ ఎన్నో సేవలు చేశాడు. ఎప్పుడూ చురుకుగా ఉంటూ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవాడని తెలిసింది. ఏ రక్త సంబంధం లేకున్నా తమకోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్దపడుతుంటారు. అందుకే మేం కూడా అభిమానులు అంటే ఎంతగానో అభిమానిస్తాం. అరవింద్ లాంటి మంచి అభిమాని చనిపోవడం చాలా విచారంగా ఉందని.. డ్రైవింగ్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని’ అని అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి