iDreamPost

తప్పు ఒప్పుకున్న శివాజీ.. నాగార్జున- ఆడియన్స్ కు క్షమాపణలు!

బిగ్ బాస్ హౌస్ లో ఆట ఆసక్తిగా సాగుతోంది. వీకెండ్ ఎపిసోడ్ మాత్రం సో..సోగా సాగిపోయింది. అయితే హౌస్ లో పెద్దాయన శివాజీ మాత్రం తన తప్పు ఒప్పుకున్నాడు.

బిగ్ బాస్ హౌస్ లో ఆట ఆసక్తిగా సాగుతోంది. వీకెండ్ ఎపిసోడ్ మాత్రం సో..సోగా సాగిపోయింది. అయితే హౌస్ లో పెద్దాయన శివాజీ మాత్రం తన తప్పు ఒప్పుకున్నాడు.

తప్పు ఒప్పుకున్న శివాజీ.. నాగార్జున- ఆడియన్స్ కు క్షమాపణలు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఈ వారం ఆసక్తికర అంశాన్ని చూశారు. ఈ సీజన్లో ఇంకా నో ఎలిమినేషన్ వీక్ రాలేదేంటా అని అంతా అనుకున్నారు. ఆ వీక్ రానే వచ్చింది. లాస్ట్ వీక్ ని నో ఎలిమినేషన్ వీక్ చేసి ఎవరినీ ఇంటి నుంచి బయటకు పంపలేదు. అలా చేయడం వల్ల అశ్వినీ, గౌతమ్ లో ఒకరు బయటకు వెళ్లాల్సింది బతికిపోయారు. వారికి మరో అవకాశం వచ్చినట్లు అయింది. ఆ అవకాశాన్ని వాళ్లు ఇద్దరూ ఎలా వాడుకుంటారో చూడాలి మరి. ఇలా ఎందుకు జరిగిందంటే.. యావర్ తన ఎవిక్షన్ పాస్ ని సరండర్ చేయడం వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే నెక్ట్స్ వీక్ మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున బాబుం పేల్చాడు.

ఇంక వీకెండ్ ఎపిసోడ్ చూసుకుంటే.. అంత ఆసక్తిగా ఏమీ జరగలేదు. టాస్కులు కూడా సో.. సోగానే సాగాయి. అయితే ఎపిసోడ్ స్టార్టింగ్ లో శివాజీ ఒక ని చేశాడు. ముందురోజు ఎపిసోడ్ లో శివాజీ విషయంలో నాగార్జున సీరియస్ అయిన విషయం తెలిసిందే. నువ్వు కొన్ని కొన్ని మాటలు ఈజీగా అనేస్తున్నావ్. కొన్ని మాటలను వేరేలా ధ్వనిస్తున్నావ్. నువ్వు ఎలా వాడినా కూడా అవి తప్పు అంటూ హోస్ట్ నాగార్జున శివాజీకి గట్టిగానే క్లాస్ పీకాడు. ఆ విషయంలో శివాజీ తనని తాను సమర్థించుకునే ప్రయత్నం కూడా చేశాడు. ఇంట్లో పోహా ఎక్కువగా వాడతామని అందుకే అమర్ ని పిచ్చి పోహా అన్నాను అంటూ ఏదో కవర్ చేయాలి అని చూశాడు. అయితే అది వర్కౌట్ కాలేదని అర్థం చేసుకున్న శివాజీ తర్వాత దిద్దుబాటు చర్యలకు దిగాడు. ఆదివారం ఎపిసోడ్ స్టార్ట్ చేయకముందే తాను ఒక విషయం చెప్పాలి అంటూ చేయి ఎత్తాడు.

నాగార్జున మాత్రం ముందు నేను మాట్లాడతాను తర్వాత నువ్వు మాట్లాడుదువూ అంటా ఆపాడు. అవకాశం ఇవ్వగానే శివాజీ క్షమాపణలు చెప్పాడు. “మీకు మీ ద్వారా ప్రేక్షకులకు నేను ఒకటి చెప్పాలి. నిన్నటి నుంచి నాకు గిల్టీగా ఉంది. నేను రెండు వాడకూడని పదాలు వాడాను. అవి పొరపాటున వచ్చినవే.. వాటెండ్ గా అన్నవి కావు. కానీ, తప్పు తప్పే కాబట్టి సారీ బాబుగారు మీకు, ప్రేక్షకులు అందరికి కూడా. క్లోజ్ నెస్ పెరిగిపోయి.. 80 డేస్ అయిపోయాయి. అది కూడా అమర్ ని మాత్రమే అలా అంటాను ఇంక ఎవరినీ అనను” అంటూ శివాజీ చెప్పుకొచ్చాడు. ముందురోజు అది అసలు తప్పుగా అనలేదు అంటూ చెప్పిన శివాజీ.. ఆదివారం ఎపిసోడ్లో మాత్రం తాను తప్పు మాటలు వాడాను అనే విషయాన్ని స్వయంగా అంగీకరించాడు. కాకపోతే అవి పొరపాటును క్లోజ్ నెస్ పెరిగిపోయి వచ్చాయి అంటూ చెప్పుకొచ్చాడు. టాపిక్ వచ్చింది కాబట్టి నాగార్జున అటు గౌతమ్ కి కూడా క్లాస్ పీకాడు. కొన్ని మాటలు కంట్రోల్ చేసుకో అంటూ గౌతమ్ కు సూచించాడు. మరి.. నాగార్జనకు శివాజీ క్షమాపణలు చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి