iDreamPost

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

ఈ మద్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులు కలవరపెడుతున్నాయి. తాము ఎంతగానో అభిమానించే నటీనటులు ఇతర రంగాలకు చెందిన వారు కన్నుమూయడంతో తీవ్ర దుఖఃంలో మునిగిపోతున్నారు.

ఈ మద్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులు కలవరపెడుతున్నాయి. తాము ఎంతగానో అభిమానించే నటీనటులు ఇతర రంగాలకు చెందిన వారు కన్నుమూయడంతో తీవ్ర దుఖఃంలో మునిగిపోతున్నారు.

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను తీవ్ర విషాదానికి గురి చేస్తున్నాయి. నటీనటులు, దర్శక, నిర్మాతలు.. ఇతర రంగాలకు చెందిన వారు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు, వారిని ఎంతగానో అభిమానించే అభిమానులు సైతం దుఖఃంలో మునిగిపోతున్నారు. వయోభారం, అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు, కెరీర్ సరిగా లేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఆత్మహత్యలు చేసుకోవడం ఇలా ఎన్నో కారణాల వల్ల సెలబ్రెటీలు కన్నుమూస్తున్నారు. తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటుడు కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..

హాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ‘బెవర్లీ హిల్స్, 90210’, ‘పోర్ట్ చార్లెస్’లో తన పాత్రలకు ప్రాణం పోసిన ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటుడు డేవిడ్ గెయిల్ (58) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన సోదరి కెటీ కోల్మెనారెస్ ఎంతో భావోద్వేగంతో తన ఇన్‌స్టాగ్రామ్ ఈ వార్తను ధృవీకరిస్తూ పోస్ట్ చేసింది. తన సోదరుడు తనకు బెస్ట్ ఫ్రెండ్ లా ఉండేవాడని కన్నీరు పెట్టుకుంది. కాకపోతే ఆయన మరణానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. కేటీ కోల్మెనారెస్ ‘ నా జీవితంలో మీరు నా పక్కన ఉంటూ ఎప్పుడూ ప్రోత్సహించేవారు.. మీరు ఎల్లపుడు నా వింగ్ మాన్, నా బెస్ట్ ఫ్రెండ్. నా హృదయంలో ప్రతిరోజూ మిమ్ముల్ని పదిలంగా ఉంచుకుంటాను. మీరు లేని లోటు ప్రతి రోజూ.. ప్రతి సెకను నన్ను బాధిస్తుంది’ అంటూ ఇన్ స్ట్రాలో రాసుకొచ్చింది.

Famous actor passed away

డేవిడ్ గెయిల్.. ఫిబ్రవరి 27, 1965న ఫ్లారిడాలోని టంపాలో జన్మించాడు, ‘బెవర్లీ హిల్స్, 90210’లో స్టువర్ట్ కార్సన్‌గా ఎనిమిది ఎపిసోడ్‌లు, ‘పోర్ట్ చార్లెస్’లో డా. జో స్కాన్‌లాన్ పాత్ర నటించి మెప్పించారు.  వీటితో పాటు ప్రదర్శనలతో టెలివిజన్‌లో తనదైన ముద్ర వేశారు. నటుడు డేవిడ్ గెయిల్ ‘సవన్నా,’ ‘ది రౌండ్ టేబుల్,’ ‘మాట్లాక్,’ మరియు ‘జాగ్,’ వంటి టీవీ సీరియల్స్ లో వివిధ పాత్రలు పోషించాడు. ‘సమ్ గర్ల్’ , ‘పర్ఫెక్ట్ ఆపోజిట్స్’ వంటి చిత్రాలలో నటించాడు. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో గెయిల్ ఎన్నో సేవలు అందించారు. ఈ సందర్బంగా ‘బెవర్లీ హిల్స్ 90210 షో’ ప్రొడ్యూసర్ పీట్ ఫెర్రిరో కూడా డేవిడ్ గెయిల్ మరణ వార్త ఎంతో బాధించిందని.. ఇండస్ట్రీ గొప్ప నటుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డేవిడ్ గెయిల్ కి ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు నివాళులర్పించారు.

 

View this post on Instagram

 

A post shared by Katie Colmenares (@colmenareskatie)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి