iDreamPost

ఏ చిన్న చెడ్డ అలవాటు లేకపోయినా.. చంద్రమోహన్ రూ.100 కోట్లు పోగొట్టుకున్నాడని మీకు తెలుసా?

  • Author singhj Updated - 12:55 PM, Sat - 11 November 23

టాలీవుడ్ సీనియర్ యాక్టర్ చంద్రమోహన్ కన్నుమూశారు. ఎలాంటి చెడు అలవాటు లేని ఆయన.. తన లైఫ్​లో రూ.100 కోట్లు పోగొట్టుకున్నారని మీకు తెలుసా?

టాలీవుడ్ సీనియర్ యాక్టర్ చంద్రమోహన్ కన్నుమూశారు. ఎలాంటి చెడు అలవాటు లేని ఆయన.. తన లైఫ్​లో రూ.100 కోట్లు పోగొట్టుకున్నారని మీకు తెలుసా?

  • Author singhj Updated - 12:55 PM, Sat - 11 November 23
ఏ చిన్న చెడ్డ అలవాటు లేకపోయినా.. చంద్రమోహన్ రూ.100 కోట్లు పోగొట్టుకున్నాడని మీకు తెలుసా?

టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ (80) ఇకలేరు. హైదరాబాద్​లోని అపోలో హాస్పిటల్​లో ట్రీట్​మెంట్ పొందుతూ ఆయన శనివారం (నవంబర్ 11) నాడు తుదిశ్వాస విడిచారు. చంద్రమోహన్ మృతితో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. సీనియర్ నటుడి మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్​లో సోమవారం చంద్రమోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 1943 సంవత్సరం, మే 23వ తేదీన ఆయన జన్మించారు. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు.

1966లో వచ్చిన ‘రంగుల రాట్నం’ సినిమాతో తెరంగేట్రం చేశారు చంద్రమోహన్. తెలుగుతో పాటు పలు తమిళ సినిమాల్లో నటించారాయన. తన అద్భుతమైన నటనకు గానూ ఫిలింఫేర్, నంది అవార్డులు అందుకున్నారు. ‘పదహారేళ్ల వయసు’, ‘సిరి సిరి మువ్వ’ మూవీస్​లో ఆయన నటనకు బెస్ట్ యాక్టర్​గా ఫిలింఫేర్ అవార్స్ దక్కాయి. 1987లో వచ్చిన ‘చందమామ రావే’ చిత్రానికి బెస్ట్ కమెడియన్​గా నంది అవార్డు, 2005లో ‘అతనొక్కడే’ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు చంద్రమోహన్. ఆఖరిగా 2017లో గోపీచంద్ ‘ఆక్సిజన్’ సినిమాలో కనిపించారాయన. సుమారు వెయ్యికి పైగా చిత్రాల్లో నటించిన చంద్రమోహన్​కు ఎలాంటి చెడ్డ అలవాటు లేదు. అయినా ఆయన రూ.100 కోట్ల వరకు పోగొట్టుకున్నారు.

డబ్బులు పోగొట్టుకున్న విషయాన్ని స్వయంగా చంద్రమోహన్ ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. పోగొట్టుకున్న ఆస్తుల గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత నటుడు గొల్లపూడి మారుతీరావు కొంపల్లికి సమీపంలో ఒక ద్రాక్ష తోట కొన్నప్పుడు తననూ కొనమని చెప్పాడని.. దీంతో 35 ఎకరాలు తీసుకున్నానని చంద్రమోహన్ చెప్పారు. అయితే ఆ ల్యాండ్​ను మెయింటెయిన్ చేయలేక అమ్మేశానన్నారు. శోభన్ బాబు చెబుతున్నా వినకుండా మద్రాసులో 15 ఎకరాలు అమ్మేశానని.. ఇప్పుడు ఆ భూముల విలువ రూ.30 కోట్లు ఉంటుందన్నారు చంద్రమోహన్. అప్పట్లో శంషాబాద్ ఎయిర్​పోర్ట్​కు దగ్గర్లో 6 ఎకరాల పొలం కొన్నానని.. అయితే అది కూడా అమ్మేశానన్నారు.

ఆ భూమిలో ఇప్పుడు రిసార్టులు పెట్టారని.. అలా తాను అజాగ్రత్తతో దాదాపు రూ.100 కోట్ల వరకు పొగొట్టుకున్నానని చంద్రమోహన్ చెప్పుకొచ్చారు. అదే ఇంటర్వ్యూలో ఆయన భార్య, రచయిత్రి జలంధర ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చంద్రమోహన్ చేయి మంచిదని.. ఆయన చేతితో ఒక్క రూపాయి తీసుకున్నా కలిసొస్తుందని చాలా మంది అంటూ ఉంటారని చెప్పారు. చంద్రమోహన్ చేతితో ఒక్క రూపాయి తీసుకున్నా మంచిదనే కారణంతో ప్రతి ఏటా జనవరి ఒకటో తేదీన ఆయన్ను కలిసేందుకు ఎంతో మంది వస్తారని జలంధర తెలిపారు. ఆయన చేతితో డబ్బులు ఇవ్వడం వల్లే తాను రచయిత్రిగా మంచి పేరు తెచ్చుకున్నానని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: చిన్న వయసులో ప్రముఖ సింగర్ కన్నుమూత!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి