iDreamPost

Action King Arjun : స్టయిలిష్ విలన్ ని సెట్ చేస్తున్న గోపీచంద్

Action King Arjun : స్టయిలిష్ విలన్ ని సెట్ చేస్తున్న గోపీచంద్

అఖండ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఒకపక్క అన్ స్టాపబుల్ టాక్ షో స్పందనని మరోపక్క ఎంజాయ్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ త్వరలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందబోయే సినిమా తాలూకు రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటారు. ఎప్పుడు అనేది చెప్పలేదు కానీ సంక్రాంతి నుంచి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత ఏడాది క్రాక్ సూపర్ హిట్ తో తిరిగి ఫామ్ లోకొచ్చిన మలినేని ఈ స్క్రిప్ట్ కోసం ఏడాదికి పైగానే వర్క్ చేస్తున్నారు. దీనికి కూడా ఒంగోలు బ్యాక్ డ్రాప్ నే ఎంచుకున్నారట. వేటపాలెం ప్రాంతంలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా చూపించబోతున్నట్టు తెలిసింది.

ఇందులో ముఖ్యమైన విలన్ క్యారెక్టర్ కు యాక్షన్ కింగ్ అర్జున్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టు వినికిడి. చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్న ఈ కాంబినేషన్ నిజంగానే తెరమీద కనువిందు చేయడం ఖాయం. అర్జున్ ప్రతినాయకుడిగా నటించడం ఇది మొదటిసారి కాదు. విశాల్ అభిమన్యుడులో ఎంత స్టైలిష్ గా పండించారో చూశాం. అదే తరహాలో ఇందులో కూడా డిఫరెంట్ గా చూపిస్తారట. అఫీషియల్ గా ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ అప్ డేట్స్ ఇచ్చే క్రమంలో బయట పెట్టొచ్చు. అప్పటిదాకా ఇది అనధికార వార్తే. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు.

వచ్చే ఏడాది దసరా లేదా దీపావళిని టార్గెట్ చేసుకుని షూట్ ని పూర్తి చేస్తారు. మైత్రి సంస్థ కాబట్టి బడ్జెట్ లో రాజీ ఉండదు. ఇదయ్యాక బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీ స్టార్ట్ అవ్వొచ్చు. లేదా సమాంతరంగా వేసవిలోనే మొదలుపెట్టే ఛాన్స్ లేకపోలేదు. చిరంజీవి తరహాలో యంగ్ డైరెక్టర్స్ తో పని చేసేందుకు ఉత్సాహ పడుతున్న బాలయ్య వరుస ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు. ఆదిత్య 369 సీక్వెల్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇంకోవైపు మోక్షాజ్ఞ ఎంట్రీ గురించి ఫాన్స్ డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆ సూచనలు మాత్రం దగ్గరలో కనిపించడం లేదు. బాలయ్య కూడా ఆ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతున్నారు

Also Read :  Akhanda & Shyam Singha Roy OTT : క్రేజీ సినిమాల డిజిటల్ ప్రీమియర్లు రాబోతున్నాయి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి