iDreamPost

Acharya OTT డిజాస్టర్ లోనూ 18 కోట్ల ఆదాయం

Acharya OTT డిజాస్టర్ లోనూ 18 కోట్ల ఆదాయం

ఒక మెగాస్టార్ సినిమా వారం తిరక్కుండానే వాషవుట్ అయిపోవడం అభిమానులకే కాదు మొత్తం కొణిదెల టీమ్ కే పెద్ద షాక్. ఆచార్య రన్ దాదాపు ఫైనల్ కు వచ్చేసింది. ఎక్కడా కనీసం సగం థియేటర్లు నిండని పరిస్థితి కనిపిస్తోంది. అగ్రిమెంట్ల ప్రకారం రెండో వారం కంటిన్యూ చేయడం తప్ప ట్రేడ్ కు రెవిన్యూ మీద పెద్ద నమ్మకం లేదు. దానికి తోడు హైదరాబాద్ లాంటి నగరాల్లో సెకండ్ వీక్ లో కేవలం యాభై రూపాయలు మాత్రమే ధర తగ్గించడం మూలిగే నక్క మీద తాటిపండు వేసినట్టే. సుమారు 80 కోట్లకు పైగా ఒక్క తెలుగు వెర్షన్ నుంచే థియేట్రికల్ లాస్ అందుకున్న ఆచార్యకు ఇంత కష్టంలోనూ క్రేజీ డీల్ దక్కిందని ఫిలిం నగర్ టాక్.

ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం కాకుండా 21 రోజులకే స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ కొత్త ప్రతిపాదన పెట్టిందట. ఇందుకు గాను ముందు డీల్ చేసుకున్న మొత్తానికి అదనంగా మరో 18 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్టుగా వినికిడి. ఇది నిజమో కాదో నిర్ధారించే ఆధారాలు లేవు కానీ లీక్ అయితే గట్టిగానే తిరుగుతోంది. ఒకవేళ వాస్తవం అయితే ఇంత డిజాస్టర్ లోనూ అంత మొత్తం రావడం అంటే మంచిదేగా. చిరంజీవి హాలిడే కోసం విదేశాలకు వెళ్లిపోగా చరణ్ ఈ రోజు నుంచి శంకర్ సినిమా షూటింగ్ లో బిజీ అయిపోతాడు. ఎటొచ్చి కొరటాల శివనే బిజినెస్ కు సంబంధించిన నష్టాల బేరీజులో తలమునకలయ్యారు.

ఆచార్య నిర్మాత నిరంజన్ రెడ్డితో పాటు కొరటాల ఎంత మేరకు నష్టాన్ని డిస్ట్రిబ్యూటర్లకు రీ పే చేయాలనే దాని మీద కసరత్తు చేస్తున్నారు. పంపిణీదారుల డిమాండ్ ఎంత ఉన్నప్పటికీ ఒక పదిహేను కోట్ల దాకా సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయట. ఇది తక్కువ ఎక్కువా అనేది పక్కన పెడితే రాబోయే చిరంజీవి సినిమాలకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఎంతో కొంత అడ్జస్ట్ మెంట్ తప్పదు. ఆచార్య వల్లే అనూహ్యంగా కెజిఎఫ్ 2 పుంజుకోవడం తాజా పరిణామం. ఇప్పుడు ఎలా ఉన్నా సర్కారు వారి పాట వచ్చాక మెగా మూవీ కథ అక్కడితో సమాప్తం అవుతుంది. ఒకవేళ కాసిన్ని థియేటర్లలో ఉన్నా అది మొక్కుబడిగా మాత్రమే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి