iDreamPost

చంద్రబాబు కేసు విచారిస్తున్న ACB కోర్టు జడ్జికి భద్రత పెంపు!

  • Published Sep 14, 2023 | 11:01 AMUpdated Sep 14, 2023 | 11:02 AM
  • Published Sep 14, 2023 | 11:01 AMUpdated Sep 14, 2023 | 11:02 AM
చంద్రబాబు కేసు విచారిస్తున్న ACB కోర్టు జడ్జికి భద్రత పెంపు!

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ విషయంపై చర్చలు నడుస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అయి.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. విజయవాడ ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలోనే ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. తాజాగా ఈ కేసు విచారిస్తున్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు భద్రతను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో చంద్రబాబుకు కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు తరుపు లాయర్ హౌస్ అరెస్ట్ గా పరిగణించాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. నిన్న ఏపీ హై కోర్టులో క్వాష్ పిటీషన్ పై విచారణ జరిగింది. ఇరు వర్గాల లాయర్లు తమ వాదన వినిపించారు. అయితే క్వాష్ పిటీషన్ పై ఏపీ హై కోర్టు ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే చంద్రబాబు కేసు విచారిస్తున్న ఏసీబీ కోర్టు న్యాయవాది హిమబిందుకి భద్రతా ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఆమెకు 4+1 ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేసింది.

ఈ సందర్బంగా ఏపీ హూం మంత్రి తాటినేని కవిత మాట్లాడుతూ.. చంద్రబాబుది హై ప్రొఫైల్ కేసు.. ఆయన అరెస్ట్ విషయం అంత ఆషామాషీ విషయం కాదు.. ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అందుకే భద్రతాపరంగా అన్ని రకాల జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యంగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అయిన హిమబిందుకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. తాజాగా జడ్జీ హిమబిందు భద్రత మరింత పెంచుతూ.. 4+4 గన్‌మాన్లను పెంచామని తెలిపారు. అంతేకాదు ఆమె ఇంటి వద్ద కూడా భారీగా బందోబస్తున్న ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చంద్రబాబును రిమాండ్ కి పంపడం అనే హై ప్రొఫైల్ కేసు విషయంలో జడ్జీ హిమబిందు ఇచ్చిన తీర్పు న్యాయవ్యవస్థ పట్ల సామాన్యుల్లో నమ్మకాన్ని మరింత పెంచింది. చట్టం అందరికీ సమానమే అని ఈ కేసు చెబుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి