iDreamPost

చంద్రబాబు రిమాండ్‌ను పొడింగిచిన ACB కోర్టు! ఎన్ని రోజులంటే..

చంద్రబాబు రిమాండ్‌ను పొడింగిచిన ACB కోర్టు! ఎన్ని రోజులంటే..

ప్రస్తుతం ఏపీ రాజకీయం మొత్తం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టు, ఆయన కేసుల చుట్టూనే తిరుగుతుంది. ముఖ్యంగా చంద్రబాబు బయటకు వచ్చేదెప్పుడు అనే సందేహం టీడీపీ శ్రేణులతో పాటు అందరిలో ఉంది. సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటీషన్ విచారణ ఈ నెల 9వ తేదీకి వాయిదా పడింది. ఇటు ఏసీబీ కోర్టులో కస్టడీ..బెయిల్ పిటీషన్ల పైన వాదనలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో నేటితో చంద్రబాబు రిమాండ్ కాలం ముగిసింది. దీంతో వర్చ్యువల్ గా కోర్టు ముందు చంద్రబాబు హాజరయ్యారు. రిమాండ్ విషయంలో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు షాకిచ్చింది. ఆయన రిమాండ్ ను పొడగిస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది.

ఏపీ స్కిల్ స్కామ్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైధీగా ఉన్న సంగతి తెలిసిందే. నేటితో ఆయన రిమాండ్ కాలం పూర్తైంది. దీంతో మరోసారి రిమాండ్ పొడిగించాలని ప్రభుత్వం తరపున లాయర్లు వాదించగా, రిమాండ్ పొడిగించాల్సిన అవసరం లేదని చంద్రబాబు తరపు లాయర్లు ఏసీబీ కోర్టులో కోరారు. ఇప్పటికే ఒకసారి చంద్రబాబు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ ఉత్తర్వుల ప్రకారం.. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి చంద్రబాబు రిమాండ్ లో ఉన్నారు. చంద్రబాబుకు రెండో దఫా విధించిన రిమాండ్ గడువు గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబును వర్చ్యువల్ గా కోర్టు ముందు హాజరుపర్చారు.

తొలి విడత రిమాండ్ పూర్తయిన తరువాత ఇదే విధానంలో కోర్టు ముందు ప్రవేశ పెట్టారు. ఆ సమయంలో రిమాండ్ లో ఇబ్బందులు ఉన్నాయా? అని న్యాయమూర్తి చంద్రబాబును ప్రశ్నించారని టాక్. ఇక, విచారణ తరువాత రిమాండ్ పొడిగింపు పైన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబుకు ఏసీబీ కోర్టు షాకిస్తూ రిమాండ్ ను పొడిగించింది. చంద్రబాబు రిమాండ్ ను మరో 14 రోజులు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నెల 19 వరకు రిమాండ్ ను ఏసీబీ కోర్టు పొడిగించింది. చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటి వాయిదా వేసింది. తాజాగా చంద్రబాబు రిమాండ్ ను పొడగిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి