iDreamPost

కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుంటున్న ఆంధ్రజ్యోతి పెద్దలు… న్యాయస్థానం కీలక నిర్ణయం..

కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుంటున్న ఆంధ్రజ్యోతి పెద్దలు… న్యాయస్థానం కీలక నిర్ణయం..

పరువునష్టం కేసులో కోర్టుకు హాజరుకాకుండా ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఎడిటర్‌ శ్రీనివాస్‌లు తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పలు వాయిదాలకు హాజరుకాకపోవడంతో వారికి వారెంట్‌ జారీ చేయాలని నిర్ణయించింది. ఇందు కోసం న్యాయస్థానమే చొరవ తీసుకుంది.

గతేడాది కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, ఎడిటర్‌ శ్రీనివాస్‌లపై పరువునష్టం వ్యాజ్యం దాఖలైంది. నిరాధారమైన వార్తలు రాసి తన పరువుకు నష్టం కలిగించారని జగ్గయ్యపేటకు చెందిన ఎం. సైదేశ్వరరావు స్థానిక కోర్టులో పరువు నష్టం పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి రాధాకృష్ణ, శ్రీనివాస్‌లు విచారణకు రావాలని ఆదేశించారు. అయినా వారు రాకపోవడంతో అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేశారు. అయితే ఈ వారెంట్‌ను పోలీసులు అమలు చేయడంలో తాత్సారం చేస్తున్నారు.

పోలీసులు తాత్సారం చేస్తున్న విషయం పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తాజాగా నిన్న సోమవారం జగిరిన వాయిదాకు కూడా రాధాకృష్ణ, శ్రీనివాస్‌లు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వారిరువురికి అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసేందుకు పోలీసులతో సంబంధం లేకుండా అడ్వకేట్‌ కమిషనర్‌ను నియమిస్తూ న్యాయమూర్తి షేక్‌ రెహనా ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు న్యాయమూర్తి టీఎల్‌ నరశింహారావు అడ్వకేట్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి