iDreamPost

అమ్మాయిల డ్రీమ్‌ బాయ్‌ అబ్బాస్‌.. ట్యాక్సీ డ్రైవర్‌గా ఎందుకు మారాడు.. ఆయన మాటల్లోనే!

  • Published Jul 19, 2023 | 9:26 AMUpdated Jul 19, 2023 | 9:26 AM
  • Published Jul 19, 2023 | 9:26 AMUpdated Jul 19, 2023 | 9:26 AM
అమ్మాయిల డ్రీమ్‌ బాయ్‌ అబ్బాస్‌.. ట్యాక్సీ డ్రైవర్‌గా ఎందుకు మారాడు.. ఆయన మాటల్లోనే!

ప్రేమదేశం సినిమా.. తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సినిమా ఎంత ఘన విజయం సాధించిదో.. దీనిలో నటించిన నటీనటులు కూడా అదే రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక మరీ ముఖ్యంగా ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోగా పరిచయం అయిన అబ్బాస్‌కు యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ పెరిగింది. అమ్మాయిల కలల రాకుమారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేమదేశం సినిమాతో స్టార్‌డమ్‌ సంపాదించుకున్నారు. ఆ తర్వాత టాలీవుడ్, తమిళ్‌, మలయాళం, కన్నడతో పాటు బాలీవుడ్‌లో కూడా నటించి.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో నీప్రేమకై, అనగనగా ఒక అమ్మాయి చిత్రాలు ఆయనకు గుర్తింపునిచ్చాయి. సౌందర్య సరసన శ్వేత నాగు చిత్రంలో కూడా నటించాడు. హీరోగా మాత్రమే కాక కొన్ని చిత్రాల్లో విలన్‌గా కూడా రాణించాడు.

సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అబ్బాస్‌.. సుమారు ఎనిమిదేళ్ల క్రితం అనగా 2015లో ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇండియా కూడా వదిలి వెళ్లారు. న్యూజిలాండ్‌కు వెళ్లిన అబ్బాస్‌.. కొన్నాళ్ల క్రితమే ఇండియాకు తిరిగి వచ్చాడు. దాంతో ఆయన అభిమానులు అబ్బాస్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తాడని భావించారు. కానీ ఆయన మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఈ విషయం పక్కకు పెడితే.. అమ్మాయిల కలల రాకుమారిగా గుర్తింపు తెచ్చుకున్న అబ్బాస్‌ సినిమాలకు దూరం అయిన తర్వాత.. ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేశారు. ఒకానొక సమయంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలని భావించారట. మరి ఎందుకు ఆయన అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో తాజా ఇంటర్వ్యూలో వివరించారు అబ్బాస్‌.

ఈ సందర్భంగా అబ్బాస్‌ మాట్లాడుతూ తన జీవితంలో ఎదర్కొన్న ఒడిదుడుకుల గురించి చెబుతూ ఎమోషనల్‌ అయ్యారు. ‘‘నేను చాలా కామ్‌ అండ్‌ ప్రైవేట్‌ పర్సన్‌ని. సోషల్‌ లైఫ్‌ అంటే నాకు ఇంట్రెస్ట్‌ లేదు.. ఇష్టపడను. నేను నటుడిని అవుతానని ఎప్పుడు అనుకోలేదు. అనుకోకుండానే 19 ఏళ్ల వయసులో డబ్బు సంపాదన కోసం సినిమాల్లోకి వచ్చాను. నా తొలి సినిమా ప్రేమ దేశం విడుదలైన రోజున ఓ సాధారణ ప్రేక్షకుడి మాదిరిగానే ప్రీమియర్‌ షోకి వెళ్లాను. మరుసటి రోజు నా ఇంటి ముందు సముద్రాన్ని తలపించేలా అభిమానులు. వారిని చూసి ఆశ్చర్యపోయా. ఎందుకు నా మీద ఇంత అభిమానం చూపించారో నాకు ఇప్పటికి అర్థం కాలేదు. కానీ ఇంత మంది ప్రేమ, అభిమానాన్ని గెలుచుకోవడం మాత్రం నిజంగా నా అదృష్టమే’’ అని చెప్పుకొచ్చారు.

‘‘ప్రేమదేశం సినిమాతో నాకు స్టార్‌డం వచ్చింది. కెరీర్‌ తొలి నాళ్లలోల​ వరుస విజయాలు అందుకున్నారు. తర్వాత అన్ని ఫ్లాప్‌లు. సినిమాలు తగ్గాయి. కనీస ఆర్థిక అవసరాలకు కూడా నా చేతిలో డబ్బులేదు. ఇక నేను చివరగా పూవెలి చిత్రంలో నటించాను. కొన్నాళ్లకు నేను చేస్తున్న పనిని ఆస్వాదించలేకపోయేవాడిని. దాంతో సినిమాలకు గుడ్‌ బై చెప్పి.. దేశం విడిచి న్యూజిలాండ్‌ వెళ్లాను. అక్కడ కుటుంబ పోషణ ​కోసం బైక్‌ మెకానిక్‌, ట్యాక్సీ డ్రైవర్‌గా కూడా పని చేశాను. ఇక పదో తరగతిలో ఫెయిల్‌ అయినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని భావించాను. అప్పుడే నేను ప్రేమించిన అమ్మాయి కూడా నాకు దూరమయ్యింది. దాంతో ఇక నేను బ్రతకకూడదని భావించాను. ఆత్మహత్య చేసుకోవాలని బలంగా నిర్ణయించుకున్నాను. కానీ నా అదృష్టం బాగుండి తర్వాత ఆ ఆలోచన నుంచి బయటపడగలిగాను’’ అన్నారు.

‘‘నేను సోషల్‌ మీడియాకు చాలా దూరం. కానీ కోవిడ్‌ సమయంలో జూమ్‌లో నా అభిమానులకు దగ్గరయ్యాను. వారితో మాట్లాడుతూ.. ఆత్మహత్య ఆలోచన చేస్తున్న వారిని మార్చాలని ప్రయత్నించాను. నా జీవితంలో నేను ఏ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవాలని భావించానో.. ఆ ఆలోచన న ఉంచి నేను ఎలా బయటపడ్డాను అన్న విషయాలను వారికి వివరించాను. కొందరిలోనైనా మార్పు తేవాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాను’’ అని చెప్పుకొచ్చారు అబ్బాస్‌.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి