iDreamPost

ఆకాశవాణి రిపోర్ట్

ఆకాశవాణి రిపోర్ట్

గత నెల వివాహ భోజనంబు డైరెక్ట్ ఓటిటి రిలీజ్ తో సౌత్ ఆపరేషన్స్ ని ప్రారంభించిన సోనీ లివ్ నిన్న తీసుకొచ్చిన కొత్త సినిమా ఆకాశవాణి. రాజమౌళి దగ్గర పనిచేసిన అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం మేకింగ్ దశ నుంచే ఒకరకమైన ఆసక్తని రేపింది. స్టార్లు లేకపోయినా కేవలం సబ్జెక్టుని నమ్ముకుని ఒక డిఫరెంట్ స్టైల్ అఫ్ మేకింగ్ తో దీన్ని రూపొందించినట్టు మేకర్స్ ముందు నుంచి చెబుతూనే వచ్చారు. థియేట్రికల్ రిలీజ్ కు పరిస్థితులు అంతగా అనుకూలంగా లేకపోవడంతో ఫైనల్ గా టీమ్ డిజిటల్ కే ఓటేసింది. అయితే ప్రమోషన్ విషయంలో మాత్రం దూకుడు కనిపించలేదు. మరి మూవీ ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం.

బయట ప్రపంచానికి దూరంగా ఒక గూడెం. అందులో అక్షరాస్యత సామజిక స్పృహ అంటే ఏంటో తెలియకుండా పెరిగిన ఓ కొండ జాతి జనం. దానికి నాయకుడుగా దొర(వినయ్ వర్మ)అలియాస్ దేవుడు పెత్తనం చెలాయిస్తూ ఉంటాడు. ఎవరు గొంతెత్తినా హద్దులు దాటినా వాళ్లకు చావే గతి. ఓ సందర్భంలో కిట్టా అనే చిన్నపిల్లాడికి అడవిలో రేడియో దొరుకుతుంది. దీని వల్లే వీళ్ళ జీవితాల్లోకి స్కూల్ మాస్టర్ చంద్రం(సముతిరఖని)వస్తాడు. మరి దొర ఆగడాలకు చెక్ పడిందా, వాళ్లలో మార్పు వచ్చిందా లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. నిజానికి ఇలాంటి పాయింట్ తో ఆలోచన చేయడమే సాహసంతో కూడుకున్నది.

బాగుందా బాలేదా అనేది పక్కనపెడితే ఆకాశవాణి నిస్సందేహంగా ఇంట్లోనే కూర్చుని చూడదగ్గ సినిమా. కమర్షియల్ హంగులు లేకపోవడం రెగ్యులర్ ఆడియన్స్ ని నిరాశ పరిచే అవకాశం ఉన్నప్పటికీ ఓవరాల్ గా ఇలాంటి చిత్రాలను ప్రత్యేకంగా ఇష్టపడేవారిని అశ్విన్ సంతృప్తిపరిచాడు. కాకపోతే ఫస్ట్ హాఫ్ ల్యాగ్, పాటలు, క్యాస్టింగ్ లో ఉన్న చిన్న చిన్న లోపాలు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ని ఇవ్వలేకపోయాయి. కాలభైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆర్ట్ డైరెక్షన్, సురేష్ రగుతు ఛాయాగ్రహణం మంచి క్వాలిటీకి దోహదపడ్డాయి. కాస్త ఓపికతో చూడగలిగితే ఓకే కానీ కథనం వేగంగా ఉండాలనుకునే వాళ్ళకు మాత్రం ఆకాశవాణి సోసోనే

Also Read : ఫ‌స్టాఫ్ ల‌వ్‌, సెకెండాఫ్ రొటీన్ స్టోరీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి