iDreamPost

హనుమంతుడు దేవుడు కాదు.. ఆదిపురుష్ రైటర్ సంచలన కామెంట్స్!

  • Author Soma Sekhar Published - 01:16 PM, Wed - 21 June 23
  • Author Soma Sekhar Published - 01:16 PM, Wed - 21 June 23
హనుమంతుడు దేవుడు కాదు.. ఆదిపురుష్ రైటర్ సంచలన కామెంట్స్!

ఆదిపురుష్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సినిమా. ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ఈ మూవీ ఇటీవలే విడుదలై మిశ్రమ స్పందన దక్కించుకుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ మైథలాజికల్ మూవీ గ్రాఫిక్స్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. దాంతో రామాయణాన్ని అగౌరవ పరిచేలా ఆదిపురుష్ ఉందని పలువురు విమర్శించారు. తాజాగా మరో వివాదానికి తెరలేపాడు ఆదిపురుష్ మాటల రచయిత మనోజ్ ముంతాషిర్. హనుమంతుడు దేవుడు కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఆదిపురుష్ సినిమా రామాయణాన్ని కించపరిచేలా తీశారని ఇప్పటికే చాలా విమర్శలు వచ్చాయి. అయితే ఈ విమర్శలకు డైరెక్టర్ స్పందించి.. ఆదిపురుష్ రామాయణం కాదని ఆ మహా గ్రంథం నుంచి ప్రేరణ పొందింది మాత్రమే అని వివరణ ఇచ్చాడు. దాంతో విమర్శలు కొద్దిగా సద్దుమనిగాయి. అయితే మరో వివాదానికి తెరలేపాడు ఆదిపురుష్ మాటల రచయిత మనోజ్ ముంతాషిర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. హనుమంతుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..”హనుమంతుడు దేవుడు కాదు. కేవలం భక్తుడు మాత్రమే. మనమే వారిని దేవుడుగా చేసుకున్నాం” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

ఇక ఆదిపురుష్ సినిమాలో తాను రాసిన డైలాగ్స్ ను సమర్థించుకున్నాడు. శ్రీరాముడిలా హనుమంతుడు కమ్యూనికేట్ చేయలేడని, రాముడిలా తాత్వికంగా మాట్లాడలేడని మనోజ్ ముంతాషిర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మనోజ్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపేలా ఉన్నాయి. కాగా.. ఆదిపురుష్ లో హనుమంతుని చేత లంకాదహనం ముందు పలికించిన డైలాగ్స్ వల్ల మనోజ్ వెలుగులోకి వచ్చాడు. ఇక ఈ డైలాగ్స్ పై విమర్శలు రావడంతో.. వాటిని మార్చడానికి ఆదిపురుష్ యూనిట్ సిద్దమైంది. ఇక మనోజ్ ముంతాషిర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి హిందూ సంఘాలు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి