iDreamPost

Google మ్యాప్స్‌లో కావాల్సిన లొకేష‌న్ ని ఎలా పిన్ చేయాలి? స‌్టెప్ బై స్టెప్ గైడ్

Google మ్యాప్స్‌లో కావాల్సిన లొకేష‌న్ ని ఎలా పిన్ చేయాలి? స‌్టెప్ బై స్టెప్ గైడ్

గూగుల్ మ్యాప్స్(Google Maps) ఈ మ‌ధ్య కొత్త ఫీచ‌ర్ల‌ను యాడ్ చేసింది. రియ‌ల్ టైం ట్రాఫిక్, టోల్ రేట్లు.. ఇంకా చాలా ఫీచ‌ర్లున్నాయి. ఇకపై గూగుల్ మ్యాప్ అంటే ఒకచోట నుంచి మ‌రోచోట‌కు వెళ్ల‌డానికి రూట్ చూపించేది మాత్ర‌మేకాదు, మీరు కావాల్సిన ప్లేస్ మీద లోకేష‌న్ ను డ్రాప్ చేసి, దాన్ని అవ‌స‌ర‌మైన వాళ్ల‌కు షేర్ చేయొచ్చు.

గూగుల్ మ్యాప్ లో ఇప్ప‌టిదాకా కావాల్సిన అడ్ర‌స్ ను, షేర్ చేయ‌లేం. కాని ఇప్పుడు అండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్ టాప్ యూజ‌ర్ల‌కు డ్రాపింగ్ పిన్ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. ఈ ఫీచ‌ర్ ను ఎలా వాడాలి?

1.ఆండ్రాయిడ్ లో… గూగుల్ మ్యాప్ యాప్ ను ఓపెన్ చేయండి
2.కావాల్సిన ప్లేస్ మీద ఎక్కువ‌సేపు ప్రెస్ చేయండి. అప్పుడు ఆ లొకేష‌న్ మీద రెడ్ పిన్ క‌నిపిస్తుంది.
3.ఆ లొకేష‌న్ కింద‌న చాలా ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి.
4.డైరెక్ష‌న్స్, స్టార్ట్ అన్న వాటి టాప్ చేసి జ‌ర్నీ స్టార్ట్ చేయొచ్చు
5.యూజ‌ర్ల‌కు సేవ్, షేర్ అప్ష‌న్లుకూడా ఉన్నాయి. వాటిని వాట్స‌ప్ తో స‌హా ఇత‌ర సోష‌ల్ మీడియా ఛాన‌ల్స్ కు షేర్ చేయొచ్చు.
6.మీరు కావాలంటే, ఆ పిన్ లొకేష‌న్ కు లేబుల్ అంటే పేరుకూడా ఇవ్వొచ్చు. చేయాల్సింద‌ల్లా లేబుల్ అన్న దానిమీద టాప్ చేయ‌డ‌మే.
7.మీరు ఈ పిన్ లొకేష‌న్ ను మూడు కేట‌గిరీల్లో సేవ్ చేసుకోవ‌చ్చు. Favorites, Want to go, starred placesలో సేవ్ చేసుకోవ‌చ్చు. యాప్ లోని కేట‌గిరీల్లో మీరు యాడ్ చేయొచ్చు. లేదంటే డిలీట్ కూడా చేయొచ్చు.
మీరు ప్రైవేట్ గా ఉంచాలా? లేదంటే ప‌బ్లిక్ చేయాలా? ఎవ‌రితోనైనా షేర్ చేసుకోవాలా? అది మీ ఇష్టం. Google Maps మీద మీరు కావాల్సిన వారితో గ్రూప్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. అప్పుడు పిన్ ల‌ను షేర్ చేసుకోవ‌డం చాలా ఈజీ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి