iDreamPost

గాంధీనగర్ లోని ఓ రహదారికి pm మోదీ తల్లి హీరాబా పేరు..

గాంధీనగర్ లోని ఓ రహదారికి pm మోదీ తల్లి హీరాబా పేరు..

భారతదేశ ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబా జూన్ 18, 1923న జన్మించారు. జూన్ 18, 2022 నాటికి ఆమె తన జీవితంలో 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టనుంది. హీరాబా తన జీవితంలో 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా గుజరాత్‌ గాంధీనగర్‌లోని రేసాన్ ప్రాంతంలోని 80 మీటర్ల రహదారికి పూజ్య హీరాబా మార్గ్ అని పేరు పెట్టాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని గాంధీనగర్ మేయర్ హితేష్ మక్వానా ప్రకటించారు.

GMC(గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్) ప్రకటన ప్రకారం, హీరాబా పేరును శాశ్వతంగా సజీవంగా ఉంచడానికి, ఆమె నుండి పరిత్యాగం, తపస్సు, సేవ మరియు మనస్సాక్షికి సంబంధించిన పాఠాలను భవిష్యత్ తరాలు గుర్తుంచుకోవాలని ఓ రహదారికి ఆమె పేరు మార్చాలని నిర్ణయించారు. ఈ ప్రాంతం బీజేపీ పాలిత గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది.

ప్రస్తుతం మోదీ తల్లి హీరాబా గాంధీనగర్ నగర శివార్లలోని రైసన్ గ్రామంలో ప్రధాని తమ్ముడు పంకజ్ మోదీతో కలిసి నివసిస్తోంది. అలాగే జూన్ 18న మోదీ గుజరాత్‌లో ఉండటంతో ఆమె పుట్టినరోజున తన తల్లిని కలిసే అవకాశం ఉంది. అదే రోజు అహ్మదాబాద్‌లోని జగన్నాథ ఆలయంలో మోదీ కుటుంబం ‘భండారో’ (కమ్యూనిటీ భోజనం) ప్లాన్ చేసింది. వాద్‌నగర్‌లోని హత్కేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ప్రధాని తల్లి దీర్ఘాయువు మరియు ఆరోగ్యం కోసం వివిధ పూజాపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వృద్ధాప్య ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రధానమంత్రి తల్లి గత సంవత్సరం గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ (GMC) ఎన్నికల్లో ఓటు వేయడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి