iDreamPost

పింక్ కలర్ లోకి మారిన నది.. స్క్రీన్ సేవర్ గా పెట్టుకుంటున్నా : ఆనంద్ మహీంద్రా ట్వీట్

కానీ.. ఆ ఫొటోలు ఇప్పటివి కావు. 2020లో తీసినవి. The Better India అనే ట్విట్టర్ ఖాతా నుంచి #Throwback హ్యాష్ టాగ్ తో పింక్ కలర్లో ఉన్న నది ఫోటోలు షేర్ అయ్యాయి. ఆ ట్వీట్ ను ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేస్తూ.. ఇలా రాశారు.

కేరళలోని కోజికోడ్ లో ఉన్న నది.. ఇప్పుడు యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. ఆ నది ఫొటోలు నెట్టింట వైరల్ అవడంతో.. ప్రకృతి ప్రేమికులు, హాలిడే ట్రిప్ కు వెళ్లాలనుకునేవారు తమ విహారయాత్రను కోజికోడ్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ.. ఆ ఫొటోలు ఇప్పటివి కావు. 2020లో తీసినవి. The Better India అనే ట్విట్టర్ ఖాతా నుంచి #Throwback హ్యాష్ టాగ్ తో పింక్ కలర్లో ఉన్న నది ఫోటోలు షేర్ అయ్యాయి. ఆ ట్వీట్ ను ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేస్తూ.. ఇలా రాశారు.

“ఈ గ్రామానికి పర్యాటకులు తరలి వస్తున్నారని వినడానికి నేను ఆశ్చర్యపోలేదు. ఈ ఫోటోను చూస్తుంటే నా ఉత్సాహం & ఆశావాద భావం పెరుగుతోంది. నేను దీన్ని నా కొత్త స్క్రీన్‌సేవర్‌గా పెట్టుకుంటున్నాను. అలాగే దానికి “రివర్ ఆఫ్ హోప్” అని పేరు పెడుతున్నాను.” అని రీ ట్వీట్ లో ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.

కోజికోడ్ కు సమీపంలోని అవల పండి కి సమీపంలోని పెరంబ్రా అనే నదిలో 2020 నవంబర్ లో ఫోర్క్డ్ ఫ్యాన్‌వోర్ట్ పువ్వులు వికసించాయి. ఆ పూల వికసింపుతో నది మొత్తం పింక్ కలర్లోకి మారిపోయాయి. ఆ ఫొటోలను అప్పట్లో ANI వార్తాసంస్థ ట్వీట్ చేసింది. నదిలో పువ్వులు వికసించినపుడు.. వాటిని చూసేందుకు యాత్రికులు తరలివస్తుంటారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి