iDreamPost

చంద్రబాబు విడుదల…తణుకు TDP తమ్ముళ్ళకు కొత్త టెన్షన్!

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టైన చంద్రబాబు..52 రోజుల తరువాత బయటకి వచ్చారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందం కట్టలు తెచ్చుకుంది. ఇలా చంద్రబాబు విడుదలపై ఆ పార్టీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తుంటే... తణుకు నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు మాత్రం టెన్షన్ పడుతున్నట్లు పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టైన చంద్రబాబు..52 రోజుల తరువాత బయటకి వచ్చారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందం కట్టలు తెచ్చుకుంది. ఇలా చంద్రబాబు విడుదలపై ఆ పార్టీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తుంటే... తణుకు నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు మాత్రం టెన్షన్ పడుతున్నట్లు పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది.

చంద్రబాబు విడుదల…తణుకు TDP తమ్ముళ్ళకు కొత్త టెన్షన్!

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో ఉంటుంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తరువాత.. ఏపీ పొలిటికల్  మరింత హీటెక్కింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టైన చంద్రబాబు..52 రోజుల తరువాత బయటకి వచ్చారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందం కట్టలు తెచ్చుకుంది. ఇలా చంద్రబాబు విడుదలపై ఆ పార్టీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తుంటే… తణుకు నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు మాత్రం టెన్షన్ పడుతున్నట్లు పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది.

నారా చంద్రబాబు నాయుడు మధ్యతర బెయిల్ పై విడుదల కావడంతో తెలుగు తమ్ముళ్లులో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఉండవల్లి వచ్చే వరకు దారిపొడవును చంద్రబాబుకు గుమ్మికూడి స్వాగతం పలికారు. పార్టీ మొత్తం అలా ఆనందంగా చిందులు వేస్తుంటే.. అందుకు భిన్నంగా తణుకు నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలకు కొత్త టెన్షన్ పట్టుకుందంట. అదే ఇప్పుడు ఆ పార్టీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం చంద్రబాబు బయటకు వచ్చిన సందర్భంగా తణుకు తమ్ముళ్లు కూడా వచ్చి స్వాగతం పలికారు. అయితే ఈ సందర్భంగా జరిగిన ఓ ఘటన తెలుగు తమ్ముళ్లలో కొత్త టెన్షన్ పుట్టించిదంట.

గతంలో వారాహి యాత్ర జరిగినప్పుడు తణుకు నుంచి విడివాడ రామచంద్రరావును గెలిపించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. అంతేకాక జనసేన తరపున ప్రకటించిన తొలి అభ్యర్థి ఆయనే అంటూ విడివాడకు ఫుల్ పబ్లిసిటీ వచ్చింది. అయితే ఆ సమయంలో పొత్తుపై పెద్ద క్లారిటీ లేకపోవడంతో తణుకు టీడీపీ నేతలు పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా చంద్రబాబు స్వాగత ర్యాలీలో దాదాపు  అలాంటి సన్నివేశం చూసి..గత్తుకున్నారంటా తణుకు టీడీపీ నేతలు. ఇంకా చెప్పాలంటే వాళ్ల గుండెల్లో రైలు పరిగెడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. జనసేన అభ్యర్థిగా ప్రకటించిన విడివాడ రామచంద్రరావుతో చంద్రబాబు ఓ నిమిషం పాటు మాట్లాడారు.

ఆయన మాట్లాడింది.. నిమిషమే అయినా తణుకు టీడీపీ నేతల్లో మాత్రం గుబులు పట్టుకుందనే టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు రాజమండ్రి నుంచి విజయవాడకు వెళ్తుండగా తణుకులో జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు.  కోర్టు షరుతుల మేరకు మార్గం మధ్యలో ఎక్కడ ప్రసంగం చేయలేదు. కానీ తణుకు చేరుకున్న చంద్రబాబు .. కారు డోర్ తీసి రామచంద్రరావుతో ముచ్చటించారు. భుజం తట్టి మరీ.. చెవులో ఏదో చెప్పారు. అదే సమయంలో విడివాడ సైతం బాబు కాళ్లకు నమష్కారం చేశారు. ఈ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గతంలో పవన్ కల్యాణ్ టికెట్ ఖరారు చేయడం. ఇప్పుడు అంతాహడావుడిలో కూడా చంద్రబాబు విడివాడను గుర్తు పట్టి దగ్గరకు పిలవడంతో.. ఇక తణుకు ఆయన అభ్యర్థిత్వం లాంఛనమే అనే పొలిటికల్ టాక్ వినిపిస్తోంది. గత  ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ ఓడిపోయింది. ఈ సారీ ఎలాగైన గెలవాలనే వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే విడివాడ రామచంద్రరావును చంద్రబాబు దగ్గరకు పిలవడంతో..తణుకు తెలుగు తమ్ముళ్లలో కొత్త టెన్షన్ మొదలైందంట. మొత్తం మీద చంద్రబాబు విడుదలపై టీడీపీ మొత్తం సంబరాలు చేసుకుంటున్న సమయంలో తణుకు టీడీపీ నేతలు మాత్రం టెన్షన్ లో పడ్డారని టాక్ వినిపిస్తోంది. మరి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నా ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి