iDreamPost

Thailand: 300 కార్లు.. 38 విమానాలు..ఈ రాయల్ లైఫ్ కలలో కూడా ఊహించలేము!

  • Published Jan 05, 2024 | 1:11 PMUpdated Jan 05, 2024 | 7:54 PM

ప్రపంచంలో ఎంతో మంది ధనికులు ఉంటారు. కానీ, మనం సరదాగా ఎపుడైనా పోల్చుకున్నా కూడా మనకు వచ్చే మొదటి పేరు అదానీ లేదా అంబానీ, ఎందులకంటే వాళ్ళు అంత మార్క్ ను సెట్ చేసుకున్నారు. అయితే, వాళ్లంత రిచ్ కాకపోయినా వారికి మించిన రాయల్ లైఫ్ ను అనుభవిస్తున్నాడు ఓ రాజు.

ప్రపంచంలో ఎంతో మంది ధనికులు ఉంటారు. కానీ, మనం సరదాగా ఎపుడైనా పోల్చుకున్నా కూడా మనకు వచ్చే మొదటి పేరు అదానీ లేదా అంబానీ, ఎందులకంటే వాళ్ళు అంత మార్క్ ను సెట్ చేసుకున్నారు. అయితే, వాళ్లంత రిచ్ కాకపోయినా వారికి మించిన రాయల్ లైఫ్ ను అనుభవిస్తున్నాడు ఓ రాజు.

  • Published Jan 05, 2024 | 1:11 PMUpdated Jan 05, 2024 | 7:54 PM
Thailand: 300 కార్లు.. 38 విమానాలు..ఈ రాయల్ లైఫ్ కలలో కూడా ఊహించలేము!

సాధారణంగా ధనవంతులంటే అందరికి గుర్తొచ్చేది.. విలాసవంతమైన భవనాలు, లగ్జరీ కార్లు. అయితే, ఈ ప్రపంచంలో బయటకు వినిపించే పేర్లతో ఉన్న ధనవంతులే కాకుండా.. వారికి మించిన విలాసవంతమైన జీవితాన్ని గడిపే వారు కూడా ఉన్నారు. కాకపోతే.. వీరి పేర్లను మనం ఎప్పుడు విని ఉండము. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ధనవంతుడి వద్ద.. ఏకంగా 300 లగ్జరీ కార్లు, 38 ఎయిర్‌క్రాఫ్ట్స్, 50కి పైగా లగ్జరీ షిప్‌లు, వజ్రాలు, వైడూర్యాలు, బంగారు సింహాసనాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ ధనవంతుడు అందరి కంటే చాలా రిచ్ లైఫ్ అనుభవిస్తున్నాడు. ఆయన మరెవరో కాదు థాయ్‌లాండ్ కు చెందిన మహారాజు మహా వజిరాలాంగ్‌కార్న్. ఇప్పుడు అందరి దృష్టి ఈ మహారాజుపైనే పడింది.

ఈయనను థాయ్‌లాండ్ రాజు రామా ఎక్స్ అని కూడా అంటూ ఉంటారు. ప్రపంచంలో ఉన్న అత్యంత ధనువంతులలో ఈ రాజు ఒకరు.ఈ రాజ కుటుంబానికి చెందిన ఆస్తి దాదాపు 3.2 లక్షల కోట్లకు పైగా ఉందట. అంతే కాకుండా వీరి ఆస్తి థాయిలాండ్ అంతటా విస్తరించింది. దీనితో పాటు థాయ్‌లాండ్‌లోని కొన్ని వేల ఎకరాల భూమి కూడా ఈ రాజుకే సొంతం. అయితే, వజిరాలాంగ్‌కార్న్ కు అరుదైన వజ్రాలను , రత్నాలను సేకరించడం అంటే ఎంతో ఇష్టం అంట. దీనితో ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రవైఢూర్యాలను కలిగి ఉన్న వ్యక్తిగా ఈయన గుర్తింపు పొందారు.

పైగా, ఈయనకు సంబంధించిన భూమిలో మాల్స్, హోటళ్లతో సహా వివిధ ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వజిరాలాంగ్‌కార్న్ థాయ్‌లాండ్‌లో రెండవ అతిపెద్ద బ్యాంక్ అయిన.. సియామ్ కమర్షియల్ బ్యాంక్‌లో 23 శాతం వాటాను కలిగి ఉన్నారట. అలాగే, దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థ అయిన సియామ్ సిమెంట్ గ్రూప్‌లో 33.3 శాతం వాటాను కలిగి ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈ రాజు ధరించిన కిరీటంలో ఒక విలువైన రత్నం ఉందట. అది 545.67-క్యారెట్ బ్రౌన్ గోల్డెన్ జూబ్లీ డైమండ్. దీని విలువ దాదాపు రూ.98 కోట్ల వరకు ఉంటుందని.. నిపుణులు అంచనా వేస్తున్నారు.

అంతే కాకుండా.. ఈ రాజు వద్ద ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్స్ కు ప్రతి ఏటా రూ.524 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఆయన లగ్జరీ కార్ల విషయమైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు .. లిమోసిన్, మెర్సిడెస్ బెంజ్‌తో సహా 300 కంటే ఎక్కువ కాస్ట్లీ కార్లు ఉన్నాయి. అలాగే, ఈయన దగ్గర ఉన్న అన్ని షిప్‌లపై గోల్డ్ కోటింగ్ ఉంటుంది. ఇక ఈ రాజు నివసించిన ప్యాలెస్ విషయానికొస్తే దాదాపు 23,51,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీనిని 1782లో నిర్మించారు. అయితే, ప్రస్తుతం ఈ ప్యాలెస్‌లో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, మ్యూజియంలు ఉన్నాయి. ఏదేమైనా, థాయిలాండ్ కు చెందిన వజిరాలాంగ్‌కార్న్ అత్యంత విలాసవంతమైన జీవితాన్ని.. అనుభవిస్తున్నాడని చెప్పి తీరాల్సిందే. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి