iDreamPost

పారా ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన సచివాలయ ఉద్యోగి!

ఏదైనా సాధించాలనే తపన ఉండాలే కానీ.. విజేతగా నిలవడం పెద్ద కష్టమేమి కాదు. అంతేకాక పట్టుదలతో కృషి చేస్తే.. గెలుపే మనకు బానిసగా మారుతుంది. అలా ఎందరో విజేతలుగా నిలిచారు. వారి జాబితాలో ఏపీకి చెందిన సచివాలయ ఉద్యోగి చేరింది.

ఏదైనా సాధించాలనే తపన ఉండాలే కానీ.. విజేతగా నిలవడం పెద్ద కష్టమేమి కాదు. అంతేకాక పట్టుదలతో కృషి చేస్తే.. గెలుపే మనకు బానిసగా మారుతుంది. అలా ఎందరో విజేతలుగా నిలిచారు. వారి జాబితాలో ఏపీకి చెందిన సచివాలయ ఉద్యోగి చేరింది.

పారా ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన సచివాలయ ఉద్యోగి!

మనిషి అనుకుంటే సాధించనది అంటూ ఏమి లేదు. పట్టుదలతో కృషి చేస్తే ఎంతటి కొండలాంటి లక్ష్యమైన మన కాళ్ల ముందరికి వస్తుంది. ఇక జీవితంలో గొప్ప విజయాలు సాధించేందుకు అంగవైగల్యం అనేది అడ్డుకానే కాదు.  అలా ఎందరు తమ సామాజిక, సాంఘీక, భౌతిక వైకల్యాలను అధికమించి ఎన్నో రికార్డు సృష్టించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన సచివాలయ ఉద్యోగి శివ గంగా దుర్గ.. అలాంటి విజేత జాబితాలోకి చేరింది. మరి.. ఆమె సాధించిన ఘనతకు తోటి ఉద్యోగులతో పాటు స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి..ఆమె సాధించిన ఘనత గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

డా.బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇంజరం సచివాలయంలో గాలిదేవర శివ గంగాదుర్గ అనే మహిళ కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు. ఆమె 2019లో ఇంజరం సచివాలయం -2లో గ్రేడ్-5 కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఇటీవల థాయిలాండ్ లో జరిగిన పారా ఒలింపిక్స్ క్రీడల్లో సత్తా చాటింది. డిస్కస్ త్రో, జావెలెన్ త్రో విభాగాల్లో రెండు స్వర్ణ పతకాలు కైవసం చేసుకుంది. అదే విధంగా షార్ట్ ఫుట్ లో నాలుగోవ స్థానంలో నిలిచింది. పతకాలు అందుకుని తాళ్లరేవు వచ్చిన గంగాదుర్గకు స్థానిక ఏంపీడీవో ఆఫీస్ లో సోమవారం ఎంపీడీఓ ఎం.అనుపమ, ఇతర అధికారులు, సచివాలయ సిబ్బంది హారతులిచ్చి స్వాగతం పలికారు. శాలువాత ఆమెను సత్కరించి పుష్పగుచ్చాలిచ్చి అభినందనలు తెలిపారు.

శివ గంగాకు బాల్యం నుంచే ఆటలంటే ఎంతో మక్కువ. అందుకే విద్యాభ్యాసం సమయంలో ఆటల్లో ఎక్కువగా పాల్గొనే వారు. ప్రైమరీ విద్యా అంతా స్థానికంగా ఉన్న కాన్వెంట్‌లో చదివి, తరువాత పదవ తరగతి వరకు హైస్కూల్‌లో చదివారు. ఆమె తండ్రి వెంకట్రామయ్య దుర్గ 6వ తరగతి చదివే సమయంలో మృతి చెందారు. అప్పటి నుంచి దుర్గ తల్లి లక్ష్మి టైలరింగ్‌ చేస్తూ తమ కుటుంబాన్ని పోషించారు.

ఇక ముమ్మిడివరం ఎయిమ్స్‌  కాలేజీలో ఇంటర్‌ చదివింది. ఆ సమయంలో ఆమెపై విధి చిన్న చూపు చూసింది. ఇంటర్ చదుతున్న సమయంలో పక్షవాతం వచ్చి ఎడమ చేయి పనిచేయకుండా పోయింది. అయినప్పటికీ ఎక్కడ నిరాశా చెందకుండా, మొక్కవోని దీక్షతో చదివి ఇంటర్‌ ను మంచి మార్కులతో పూర్తిచేసింది. అనంతరం బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసి.. ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఎస్‌సీ స్పేస్‌ ఫిజిక్స్‌ చేసేందుకు చేరింది. అక్కడ ఉన్నప్పుడే పారా ఒలింపిక్స్‌ గురించి తెలుసుకున్న శివ గంగాదుర్గ, ఎలాగైనా ఆ గేమ్స్ లో పాల్గొనాలని కంకణం కట్టుకుంది. ఇలా పీజీ చదువుతుండగానే ఆమెకు కార్యదర్శిగా ఉద్యోగం వచ్చింది. జాబ్ రావడం, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో చదువు మానేసి కార్యదర్శిగా విధుల్లోకి చేరింది.

అలానే తనకు ఆటలపై ఆసక్తి ఉండటంతో యానాంలోని వైఎస్సార్‌ క్రీడా ప్రాంగణంలో పారా స్పోర్ట్స్‌ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంది. జాతీయ స్థాయిలో జరిగిన అనేక క్రీడల్లో ఆమె పాల్గొన్నారు. 2021లో బిహార్‌లో జరిగిన జాతీయ స్థాయి పారా స్పోర్ట్స్‌లో డిస్కస్‌ త్రోలో స్వర్ణం సాధించారు. అలానే 2022, 23లలో జరిగిన జాతీయస్థాయి పోటీలలో కూడా ప్రతిభ కనబరిచారు. ఈ క్రమంలోనే ఇటీవల థాయిలాండ్‌లో జరిగిన పారా ఒలింపిక్స్‌కు శివ గంగా దుర్గ ఎంపికైంది. మన దేశం నుంచి సుమారు 70 మంది పాల్గొనగా, ఏపీ నుంచి ముగ్గురు మాత్రమే పాల్గొన్నారు. వీరిలో శివ గంగాదుర్గ డిస్కస్‌ త్రో, జావెలెన్‌ త్రోలలో ఎఫ్‌–35 విభాగంలో స్వర్ణ పతకాలు సాధించారు. మరో క్రీడ షాట్‌పుట్‌లో నాలుగవ స్థానంలో నిలిచారు.

ఇక శివ దుర్గగంగా పారా ఒలింపిక్స్ లో పాల్గొనాలంటే రూ.2 లక్షలకు పైగా ఖర్చవుతుందని అధికారులు తెలిపారు. దీంతో ఆమె ప్రతిభను గుర్తించిన రిలయన్స్ సంస్థ రూ.50 వేల సహాయం ప్రకటించింది. అలానే  మరో రూ.2 లక్షల బ్యాంక్ నుంచి రుణం తీసుకుని పోటీలకు హాజరైనట్లు ఆమె మీడియాకు తెలిపింది.  మండల అధికారులు,తన సహచర ఉద్యోగుల సహకారంతో ఈ ఘనత సాధించగలిగానని దుర్గ తెలిపారు. తనకు స్పాన్సర్స్‌ ఉంటే మరిన్ని పతకాలు సాధిస్తానని శివ గంగాదుర్గ  తెలిపారు. మరి.. సచివాలయ ఉద్యోగిని సాధించిన ఈ ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి