iDreamPost

మీ పిల్లలను ఇలాంటి టీచర్స్ ఉండే స్కూల్స్ కైతే పంపించకండి.. ఏమైందంటే?

  • Published Mar 21, 2024 | 6:10 PMUpdated Mar 21, 2024 | 6:10 PM

స్కూల్ లో పాఠాలు చెప్పాల్సిన టీచర్స్ పిల్లలపై వారి ప్రతాపాన్ని చూపిస్తున్నారు. సహజంగా టీచర్లు విద్యార్థులను చదువు విషయంలో మందలిస్తుంటారు. కానీ, ఇక్కడ ఓ స్కూల్ లో మాత్రం చావు దెబ్బలు కొడుతున్నారు.

స్కూల్ లో పాఠాలు చెప్పాల్సిన టీచర్స్ పిల్లలపై వారి ప్రతాపాన్ని చూపిస్తున్నారు. సహజంగా టీచర్లు విద్యార్థులను చదువు విషయంలో మందలిస్తుంటారు. కానీ, ఇక్కడ ఓ స్కూల్ లో మాత్రం చావు దెబ్బలు కొడుతున్నారు.

  • Published Mar 21, 2024 | 6:10 PMUpdated Mar 21, 2024 | 6:10 PM
మీ పిల్లలను ఇలాంటి టీచర్స్ ఉండే స్కూల్స్ కైతే పంపించకండి.. ఏమైందంటే?

సహజంగా ఏ స్కూల్ లో అయినా.. విద్యార్థులు సరిగా చదవకపోయినా, మాట వినకపోయినా టీచర్లు వారిని మందలిస్తూ ఉండడం సహజమే. అయితే, ఇక్కడ గోదావరి ఖనికి చెందిన టీచర్లు మాత్రం బెత్తంతో వారి ప్రతాపాన్ని చూపిస్తున్నారు. అది కూడా విద్యార్థులు తీవ్రంగా గాయపడేలా కొడుతున్నారు. పైగా ఈ విషయంలో ఉన్నత అధికారులు కొంచెం కూడా స్పందించడంలేదు. గోదావరి ఖని ఎల్బీ నగర్ లోని ఇండో అమెరికన్ పాఠశాలలో.. 3వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని.. ఒక టీచర్ బాగా కొట్టడంతో.. అతని వీపుకు విపరీతంగా గాయాలు అయ్యాయి. దీనితో ఆ విషయాన్నీ తన తల్లిదండ్రులకు చెప్పడంతో .. స్కూల్ యాజమాన్యాన్ని తల్లిదండ్రులు నిలదీశారు.

ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న విద్యార్థి సంఘం నాయకులు.. వెంటనే పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని.. ఆ పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. ఉన్నత అధికారులు సరైన రీతిలో స్పందించకపోవడం వలెనే.. ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని.. విద్యాశాఖ అధికారులు ఆయా పాఠశాలలపై తగిన చర్యలు తీసుకోవాలని.. విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. స్కూల్ లో టీచర్స్ చదువు చెప్పాల్సింది పోయి.. పిల్లలను చావు దెబ్బలు కొడుతున్నారంటూ.. వాపోయారు. గోదావరి ఖనిలోని.. కళ్యాణ్ నగర్ లో ఒక పాఠశాలలో.. రెండు రోజుల క్రితం.. యూకేజీ చదువుతున్న ఓ పిల్లవాడిని.. ఒక టీచర్ పెన్నుతో పొడవడంతో.. ఆ బాలుడికి కంటి వద్ద తీవ్ర గాయాలు అయ్యాయి. దీనితో ఆ బాలుడి తండ్రి స్కూల్ యాజమాన్యంపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు.

ఇలా వరుసగా జరుగుతున్న ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులలో.. వారిని స్కూల్స్ కి పంపాలంటేనే అందరూ.. భయపడుతున్నారు. ఇలా రెండు పాఠశాలలో వరుసగా జరిగిన సంఘటనలను.. విద్యార్థి సంఘం నాయకులు.. పిల్లలను కొట్టినట్లుగా ఉన్న ప్రూఫ్స్ తో సహా .. వాట్సాప్ ద్వారా జిల్లా కలెక్టర్ కు కంప్లైంట్ చేశారు. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కౌన్సిలర్ .. సతీష్ చిన్నారుల ఇంటికి వెళ్లి పూర్తి విచారణ చేపట్టారు. ఇకపై ఎవరైనా చిన్నారుల పట్ల కఠినంగా ప్రవరిస్తే.. 1089 కు వెంటనే కంప్లైంట్ చేయాలనీ.. సూచించారు. అలాగే చిన్నారుల విషయంలో ఇంత జరుగుతున్నా కానీ, ఉన్నత అధికారులు మాత్రం ఏ మాత్రం స్పందించకపోవడంతో.. ఆయా జిల్లాల ఉన్నత అధికారులపై కూడా.. చర్యలు తీసుకోవాలని.. విద్యార్థి సంఘం నాయకులు విన్నవించుకున్నారు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి