iDreamPost

రామ్ పోతినేనిపై అభిమానం చాటుకున్న అభిమాని!

రామ్ పోతినేనిపై అభిమానం చాటుకున్న అభిమాని!

హీరోలకు అభిమానులు ఉండటం సర్వ సాధారణం. ఫేవరేట్ హీరోల సినిమా విడుదలౌతుందంటే చాలు.. థియేటర్ల వద్ద పెద్ద పెద్ద కటౌట్లు కట్టి, బాణా సంచాలు పేల్చి సందడి చేసే వారు కొందరు అయితే.. వారి పుట్టిన రోజులకు, అవార్డులు వచ్చిన సమయంలో బ్యానర్లు వేయించడం, రక్తదానాలు, అన్నదానాలు చేస్తుంటారు. కొంత మంది డైహార్ట్ ఫ్యాన్స్ అయితే ఏకంగా తమ ఫేవరేట్ హీరోల పేర్లను, ఫోటోలను పచ్చబొట్టులా వేయించుకోవడం చేస్తుంటారు. ఇటీవల బాలయ్య ఫ్యాన్ ఒకరు.. తన పెళ్లి కార్డులపై సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ ఫోటోలను ముద్రించడమే కాకుండా.. ఆయన వస్తేనే పెళ్లి చేసుకుంటానని చెప్పి వార్తల్లో నిలిచాడు. బాలయ్య తరుఫున వారి చిన్నల్లుడు వెళ్లిన సంగతి విదితమే. తాజాగా రామ్ పోతినేని ఫ్యాన్స్ ఒకరు అతడిపై తన అభిమానాన్నిచాటుకున్నారు.

టాలీవుడ్ యంగ్ టాలెంటర్స్‌లో ఒకరు రామ్ పోతినేని. దేవదాసు సినిమాతోనే తన ఈజ్ నటన, డ్యాన్స్‌లతో అదరగొట్టేశాడు. జగడంతో ఆయనకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. రెడీతో బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన మస్కా, గణేష్ వంటి సినిమాలు నిరాశపర్చినా.. కందిరీగతో ట్రాక్ లోకి వచ్చాడు. పలు సినిమాలు ప్లాపులు ఎదురైనా.. తన ప్రయత్నాన్ని ఎక్కడా ఆపలేదు రామ్. ఇస్మార్ట్ మూవీతో తనలోని మాస్ నటనతో ఇరగదీశాడు. దీంతో అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఇప్పుడు స్కందతో మన ముందుకు రాబోతున్నాడు. అయితే రామ్ పోతినేనికి వీరాభిమాని అయిన ఓ వ్యక్తి అతడిపై అభిమానం ప్రదర్శించాడు. తన పుట్టిన బిడ్దకు స్కంద అని పేరును పెట్టి రామ్ అభిమానినని చెప్పకనే చెప్పేశాడు. వివరాల్లోకి వెళితే.. హరహర అనే వ్యక్తికి రామ్ అంటే పిచ్చి అభిమానం. ఇటీవల అతడికి పండంటి మగబిడ్డ జన్మించారు. ఆ బిడ్డకు బారసాల నిర్వహించి, ఆ అబ్బాయికి స్కంద అనే పేరును పెట్టారు. ఈ ఫంక్షన్ కు రామ్ అభిమానులు కూడా హాజరయ్యి, స్కందను ఆశీర్వదించారు. సోషల్ మీడియాలో దీని గురించి పోస్టు చేయడంతో వెలుగులోకి వచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి