iDreamPost

వెళ్తున్న ఆటోపై కుప్పకూలిన క్రేన్.. సీసీ ఫుటేజ్ లో భయానక దృశ్యాలు!

రోడ్డుపై వెళ్తున్న ఆటోపై ఓ భారీ క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఆ ఆటో రెండు ముక్కలైంది. ఈ ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

రోడ్డుపై వెళ్తున్న ఆటోపై ఓ భారీ క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఆ ఆటో రెండు ముక్కలైంది. ఈ ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

వెళ్తున్న ఆటోపై కుప్పకూలిన క్రేన్.. సీసీ ఫుటేజ్ లో భయానక దృశ్యాలు!

రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్లు కూలుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు చాలా చోట్ల చోటు చేసుకున్నాయి. ఇటీవల హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లై ఓవర్ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో కొందరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు అప్రమత్తమై వెంటనే గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనతో వాహనదారులు ఉలిక్కిపడ్డారు. అయితే, ఈ ఘటన మరువకముందే ఇలాంటి ఘటనే తాజాగా మరో చోట చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఆటోపై ఓ క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలింది.

దీంతో ఆ ఆటో రెండు ముక్కలైంది. ఈ ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్స్ ఉలిక్కిపడుతున్నారు. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఈ ప్రమాదంలో ఎవరికైనా ప్రాణ నష్టం జరిగిందా? అసలేం జరిగింగిందంటే? పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ లోని సూరత్ లో మెట్రో నిర్మాణంలో భాగంగా ఓ భారీ క్రేన్ ఉపయోగిస్తున్నారు. అయితే, శుక్రవారం ఈ క్రేన్ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ క్రేన్ ఇదే సమయానికి రోడ్డుపై నుంచి వెళ్తున్న ఆటోపై పడింది. ఈ ప్రమాదంలో ఆ ఆటో రెండు ముక్కలు అయింది.

వెంటనే అప్రమత్తమైన ఆటో డ్రైవర్ అందులో నుంచి బయటపడి ప్రాణాలు కాపాడుకున్నాడు. వెంటనే స్పందించిన అధికారులు రోడ్డుపై పడి పోయిన ఆ భారీ క్రేన్ ను తొలగించారు. కొందరి కార్మికుల పొరపాటు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ కొద్దిపాటి గాయాలతో అదృష్టవశావత్తు ప్రాణాలతో బయటపడ్డాడని అధికారులు తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా సిబ్బంది తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అయితే, ఈ ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఉలిక్కిపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి