iDreamPost

గుండెపోటుతో క్లాసులోనే కుప్పకూలిన 9వ తరగతి విద్యార్థి

గుండెపోటుతో క్లాసులోనే కుప్పకూలిన 9వ తరగతి విద్యార్థి

గత కొన్నాళ్ల నుంచి వరుస గుండెపోటు మరణాలు ప్రజలను భయందోళనలకు గురి చేస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇలా వయసుతో తేడా లేకుండా హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు విడుస్తున్నారు. జిమ్ చేస్తూ, క్రికెట్ ఆడుతూ, డ్యాన్స్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలి చనిపోతున్నారు. ఇలా చాలా మంది గుండెపోటుతో చనిపోవడంతో ప్రజలు భయపడిపోతున్నారు. అయితే ఈ క్రమంలోనే తాజాగా ఓ 9వ తరగతి విద్యార్థి గుండెపోటుతో మరణించాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఖమ్మంలోని ఎన్ ఎస్ పీ కాలనీలో రాజష్ అనే బాలుడు తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నాడు. ఇతడు స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కాగా, రాజేష్ ఎప్పటిలాగే గురువారం ఉదయం కూడా స్కూల్ కు వెళ్లాడు. అయితే క్లాసులో ఉండగానే అతడికి గుండెలో నొప్పిగా ఉన్నట్లు అనిపించింది. దీంతో వెంటనే స్కూల్ టీచర్స్ కు తెలియజేశాడు. దీంతో ఉపాధ్యాయులు అప్రమత్తమై ఆ బాలుడిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఇక చికిత్స పొందుతూ రాజేష్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలు పగిలేలా ఏడ్చారు. వీళ్లే కాకుండా నిన్నటి వరకు మాతో పాటు ఆడిపాడిన రాజేష్ ఇక లేడు, రాడని తెలియడంతో అతని స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాజేష్ మరణంతో అతని స్వగ్రామంలో విషాద ఛాయలు అలుమకున్నాయి. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

ఇది కూడా చదవండి: ఆపరేషన్ థియేటర్‌లో షార్ట్ సర్క్యూట్.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి