iDreamPost

కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. 9 మంది మృతి, 20 మందికి గాయాలు

కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. 9 మంది మృతి, 20 మందికి గాయాలు

కెమికల్ ఫ్యాక్టరీలో సంభవించిన పేలుడు ధాటికి 9 మంది మృతి చెందగా.. మరో 20 మందికి గాయాలైన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. రాష్ట్రంలో హాపూర్ లో ఉన్న ఒక కెమికల్ ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలడంతో 9 మంది కూలీలు మృతి చెందారు. మరో 20మంది కూలీలకు గాయాలయ్యాయి. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో..దాని ప్రభావం దగ్గర్లో ఉన్న ఫ్యాక్టరీలపై కూడా పడింది. ఆయా ఫ్యాక్టరీల పై కప్పులు కూడా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు.

ఢిల్లీకి 80 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. పేలుడు ప్రమాదం పై సమాచారం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మూడు గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు. అనంతరం క్షతగాత్రులను సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ స్పందించారు. ప్రమాదంలో చనిపోయిన, గాయపడిన వారి కుటుంబాలను ఆదుకుంటామన్నారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి