iDreamPost

Radhe Shyam : కేవలం క్లైమాక్స్ కోసమే 50 కోట్లా

Radhe Shyam : కేవలం క్లైమాక్స్ కోసమే 50 కోట్లా

బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ మీద నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ చాలా నమ్మకంగా ఉంది. ఎంతగా అంటే ఒకవేళ ఆర్ఆర్ఆర్ నిజంగానే జనవరి 7న వచ్చినా సరే తమ సినిమా ఖచ్చితంగా పోటీ ఇస్తుందనే రేంజ్ లో. అందుకే అన్ని రకాలుగా ఆలోచించే రిలీజ్ డేట్ ని మార్చుకునే ప్రసక్తే లేదని ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే వచ్చారు. ఈ నెల 23న ప్రభాస్ పోషించిన విక్రమాదిత్య పాత్రను వీడియో టీజర్ రూపంలో విడుదల చేయబోతున్నారు. అదే రోజు మరో స్పెషల్ కూడా ఉండొచ్చనే టాక్ ఉంది కానీ అదేంటనేది బయటికి చెప్పడం లేదు. రాధే శ్యామ్ ఆడియో సందడి ఇంకా మొదలు కావాల్సి ఉంది.

ఇప్పుడీ సినిమా తాలూకు విశేషాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సుమారు పదిహేను నిమిషాల పాటు సాగుతూ యాక్షన్ తో ఎమోషన్ తో అదరగొడుతుందని, మగధీర తర్వాత ఆ స్థాయిలో ప్రభావం చూపించే సినిమా ఇదే అవుతుందని ఇన్ సైడ్ టాక్. 70 దశకం యూరోప్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ పీరియాడిక్ లవ్ స్టోరీలో జయరాం, భాగశ్రీ లాంటి సీనియర్ మోస్ట్ క్యాస్టింగ్ చేసిన క్యారెక్టర్లు కూడా ఊహాకతీతంగా ఉంటాయని అంటున్నారు. పూజా హెగ్డే తో డార్లింగ్ రొమాన్స్ ఫ్రెష్ గా ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ని రిపీట్ వచ్చేలా చేస్తుందని ఊరిస్తున్నారు. బహుశా ఇంత ఆలస్యం కావడానికి కారణం ఇదే కావొచ్చు.

జనవరి 14 విడుదలకు ఇంకెలాంటి సందేహాలు అక్కర్లేదు. ఇప్పటికే బిజినెస్ డీల్స్ అన్నీ కొలిక్కి వచ్చేశాయి. ఎట్టి పరిస్థితుల్లో మార్పు ఉండదని డిస్ట్రిబ్యూటర్లకు స్పష్టమైన సమాచారం ఉందట. సుమారు 400 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన రాధే శ్యామ్ కు కేవలం ఒక్క సినిమా మాత్రమే అనుభవం ఉన్న రాధాకృష్ణ దర్శకుడు కావడం నార్త్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. అతని మొదటి చిత్రం జిల్ టేకింగ్ నచ్చే ప్రభాస్ యువి సంయుక్తంగా ఈ అవకాశం ఇచ్చారు. మరి ఇంత బరువుని ఒత్తిడిని తట్టుకుని సాహో సుజిత్ లా కాకుండా గొప్ప ఫలితాన్ని అందుకుంటాడేమో చూడాలి. రాధే శ్యామ్ కు జస్టిన్ ప్రభాకర్ సంగీతం సమకూర్చారు.

Also Read : Akhanda : బాలయ్య దిగితే ఇంకా రచ్చే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి