iDreamPost

ఢిల్లీ ఎఫెక్ట్‌: 12 గంటల్లో 43 కేసులు..

ఢిల్లీ ఎఫెక్ట్‌: 12 గంటల్లో 43 కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కరోనా కేసులు అధిక సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి. నిన్న మంగళవారం రాత్రి 9 గంటల నుంచి ఈ రోజు బుధవారం ఉదయం 9 గంటల మధ్యలో 43 మందికి వైరస్‌ సోకినట్లు నిర్థారణ అయింది. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా 87కు చేరుకుంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఒక్కరోజు వెలుగు చూసిన 43 మంది ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన జమాత్‌ సదస్సుకు వెళ్లిన వారే కావడం గమనార్హం.

ఏపీ నుంచి 1470 మంది ఢిల్లీ వెళ్లారని అధికారులు నిర్థారించి, వారిలో 1321 మందిని గుర్తించారు. వారందరిని ఆయా జిల్లాలోని కరోనా ఆస్పత్రులకు తరలించారు. వీరిలో 373 మందికి పరీక్షలు చేయగా 43 మందికి కరోనా వైరస్‌ ఉన్నట్లు తేలింది. మిగతా 340 మందికి నెగిటివ్‌ వచ్చింది. ఇంకా దాదాపు వెయ్యి మందికి పరీక్షలు చేయాల్సి ఉంది. వీరి ఫలితాలు వచ్చిన తర్వాత కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ao కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్యలో నాలుగు జిల్లాలు రెండంకెలకు చేరుకున్నాయి, కడప, ప్రకాశం జిల్లాల్లో 15 కేసులు, పశ్చిమ గోదావరిలో 13, విశాఖ పట్నంలో 11 కేసులు నమోదయ్యాయి. ఏపీలోని 13 జిల్లాల్లో కరోనా వైరస్‌ సోకిన వారుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి