iDreamPost

నలుగురు సీనియర్లు – జాగ్రత్త డెసిషన్లు

నలుగురు సీనియర్లు – జాగ్రత్త డెసిషన్లు

తెలుగు సినిమాను మూడు తరాలుగా విభజించుకుంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజుల శకం అయ్యాక తర్వాత ఏలింది చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు. కొత్త జెనరేషన్ వచ్చినా సరే ఇప్పటికీ తరిగిపోని ఉత్సాహంతో సినిమాలు చేయడం అందులోనూ బ్లాక్ బస్టర్స్ కొట్టడం వీళ్ళకే చెల్లింది. ఇప్పుడు కోవిడ్ 19 వల్ల షూటింగులు ఆగిపోయాయి. ఒకవైపు ప్రభుత్వం వయసులో పెద్దవాళ్ళను బయటికి రావొద్దని పదే పదే చెబుతోంది. ఈ నలుగురేమో ఆరు పదుల వయసు వాళ్ళే. వెంకీ జస్ట్ ఒక సంవత్సరం తక్కువ సిక్స్టీ మార్కుకు దగ్గరలో ఉన్నారు. నాగ్ ఆల్రెడీ టచ్ చేశారు. ఇక చిరు బాలయ్య ఎప్పుడో అందుకున్నారు.

షూటింగులు రీ స్టార్ట్ అయ్యాక రిస్క్ జోన్ లో ఉండే అవకాశం కూడా వీళ్ళకే ఎక్కువ. స్పాట్ కు వచ్చే యూనిట్ సభ్యుల చెకింగ్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అంతర్గతంగా ఉన్న వైరస్ ని గుర్తించడం అంత ఈజీ కాదు. అందుకే ఇప్పుడు ఆయా దర్శక నిర్మాతల ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయా అనే ఆసక్తి సర్వత్రా మొదలైంది. అందులోనూ ఈ హీరోలు వెంటనే షూటింగులకు ఎస్ అంటారా అనేది కూడా ప్రశ్నార్థకమే. చిరంజీవి ఆచార్య ఇంకా 40 శాతం పైగా బాలన్స్ ఉంది. బాలయ్య – బోయపాటి మూవీ లాక్ డౌన్ కు ముందు మొదలై నెల కూడా కాలేదు. నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ ముందు విదేశాల్లో ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేకపోవడంతో లొకేషన్స్ మార్చి హైదరాబాద్ లోనే తీయబోతున్నట్టు సమాచారం.

వెంకటేష్ నారప్ప వీటి కంటే బెటర్ పొజిషన్ లో ఉంది. ఇంకో 20 శాతం మాత్రం పెండింగ్ ఉందని సురేష్ బాబు చెప్పారు. సో ఫస్ట్ రిలీజ్ వీళ్ళలో వెంకీకే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏది ఎలా ఉన్నా నలుగురు హీరోలైతే చాలా అప్రమత్తంగా ఉండటం అవసరం. ఇప్పట్లో వీళ్ళు సెట్ కు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని కొన్ని మీడియా వర్గాల్లో కథనాలు రావడంతో అభిమానులు కొంత టెన్షన్ కూడా పడ్డారు. సినిమా కంటే ముందు ఆరోగ్యం ముఖ్యం. ఆ దిశగా ఆలోచిస్తే ఇవి కొంత ఆలస్యం అయ్యే ఛాన్స్ లేకపోలేదు. ఒకవేళ ఇండియా పూర్తిగా కరోనా ఫ్రీ అయితే ఎంత ధైర్యంగా అయినా ఉండొచ్చు కాని కేసులు లక్షకు దగ్గరగా ఉన్న తరుణంలో షూటింగుల విషయంలో మరీ ఎక్కువ ఆశలు పెట్టుకుంటే నిరాశ తప్పదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి