iDreamPost

వీడియో: ఆసుపత్రిలో రీల్స్ చేస్తూ మెడికోల ఓవరాక్షన్‌.. 38 మంది సస్పెండ్‌

సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు వైద్య విద్యార్థులు ఏకంగా ఆసుపత్రిలోనే సినిమా పాటలకు డ్యాన్సులు వేశారు. వారు చేసిన పనికి యాజమాన్యం తిక్కకుదిర్చింది. రీల్స్ చేసిన మెడికోలను సస్పెండ్ చేసింది.

సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు వైద్య విద్యార్థులు ఏకంగా ఆసుపత్రిలోనే సినిమా పాటలకు డ్యాన్సులు వేశారు. వారు చేసిన పనికి యాజమాన్యం తిక్కకుదిర్చింది. రీల్స్ చేసిన మెడికోలను సస్పెండ్ చేసింది.

వీడియో: ఆసుపత్రిలో రీల్స్ చేస్తూ మెడికోల ఓవరాక్షన్‌.. 38 మంది సస్పెండ్‌

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కొందరు చేస్తున్న విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు తాము ఏ ప్లేస్ లో ఉన్నామన్నా సంగతి మరిచి డ్యాన్సులు చేస్తూ, వీడియోలు తీస్తూ నానా రచ్చ చేస్తున్నారు. లైకులు, వ్యూస్ కోసం పబ్లిక్ ప్లేస్ లల్లో, నడిరోడ్లపై, చివరికి ఆసుపత్రుల్లో కూడా రీల్స్ చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల ఓ డాక్టర్ ఏకంగా ఆసుపత్రిలోనే ఫ్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించాడు. దీంతో అతనిపై అధికారులు మండిపడ్డారు. తాజాగా ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఆసుపత్రిలో ఉన్నామన్న సోయి లేకుండా సినిమా పాటలకు రీల్స్ చేస్తూ ఓవరాక్షన్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

కర్ణాటకాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికోలు విధుల్లో ఉన్న సమయంలో రీల్స్ చేశారు. ఈ ఘటన గదగ్‌లోని ప్రభుత్వ జిమ్స్‌ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. 38 మంది వైద్య విద్యార్థులు జిల్లా ఆస్పత్రి కారిడార్‌లో కన్నడ సినిమా పాటకు డ్యాన్సుల చేస్తూ హల్ చల్ చేశారు. దీంతో వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే రోగులను పట్టించుకోకుండా రీల్స్ చేస్తూ కాలక్షేపం చేస్తున్న మెడికోలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్య విద్యార్థులై ఉండి ఆసుపత్రిలో ఇలా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.

ఈ ఘటనపై స్పందించిన జిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బసవరాజ బొమ్మనహళ్లి రీల్స్ చేసిన 38మంది వైద్య విద్యార్థులపై చర్యలు తీసుకున్నారు. వారిని 10 రోజుల పాటు సస్పెండ్‌ చేసినట్లు వెల్లడించారు. ఆసుపత్రిలో రీల్స్ చేయడం తప్పని తెలిపారు. రీల్స్ చేసేందుకు ఏవిధమైన అనుమతి ఇవ్వలేదని యాజమాన్యం వెల్లడించింది. రోగులకు ఇబ్బందులు కలిగేలా వ్యవహరించకూడదని వైద్య విద్యార్థులకు సూచించారు. రీల్స్ చేయాలనుకుంటే ఆసుపత్రి వెలుపల చేసుకోవాలని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరి ఆసుపత్రిలో రీల్స్ చేసిన వైద్య విద్యార్థులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి