iDreamPost

వాటర్ ట్యాంక్ లో 30 కోతుల మృతదేహాలు.. 3 రోజులుగా అవే నీరు తాగుతున్నారు!

Monkeys In Water Tank: ఓ ప్రాంతంలో 200 గృహాలకు తాగునీరు సరఫరా చేసేందుకు ఓ ట్యాంకు నిర్మించారు. అయితే ఆ ట్యాంక్ లో మూడు రోజుల క్రితం 30కి పైగా కోతులు మృతి చెందాయి. ఆ విషయం గమనించిన మున్సిపల్ సిబ్బంది ఆ నీటిని జనాలకు సరఫరా చేశారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Monkeys In Water Tank: ఓ ప్రాంతంలో 200 గృహాలకు తాగునీరు సరఫరా చేసేందుకు ఓ ట్యాంకు నిర్మించారు. అయితే ఆ ట్యాంక్ లో మూడు రోజుల క్రితం 30కి పైగా కోతులు మృతి చెందాయి. ఆ విషయం గమనించిన మున్సిపల్ సిబ్బంది ఆ నీటిని జనాలకు సరఫరా చేశారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వాటర్ ట్యాంక్ లో 30 కోతుల మృతదేహాలు.. 3 రోజులుగా అవే నీరు తాగుతున్నారు!

తరచూ మనకు అనేక దారుణమైన ఘటనలు  కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా తాగు నీటి విషయంలో అప్పుడప్పుడు ఘోరమైన ఘటన చోటుచేసుకుంటాయి. వాటర్ ట్యాంక్ లో వివిధ రకాల కలుషిత నీరు రావడం, మూగ జీవాల కళేబరాలు కనిపించడం వంటివి చోటుచేసుకుంటాయి. గతంలో ఓ సారి హైదరాబాద్ లోని ముషిరాబాద్ ప్రాంతంలో ఓ వాటర్ ట్యాంక్ లో  కుళ్లిన మృతదేహం కనిపించడం సంచలనం సృష్టించింది. తాజాగా అదే తరహా ఘటన నల్గొగొండ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే ఇక్కడ ఏకంగా 30 కోతుల కళేబరాలు వాటర్ ట్యాంక్ లో కనిపించాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

నల్గగొండ జిల్లా నందికొండ పట్టణంలో తాగునీటి సరఫరా చేసే ట్యాంక్ లో 30 కోతులు మృతి చెందాయి. మూడు  రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడు రోజులుగా ఆ నీటిని స్థానికులకు మున్సిపల్ సిబ్బంది సరఫరా చేశారు. హిల్ కాలనీ విజయ విహార్ సమీపంలోని సుమారు రెండు వందల నివాస  గృహాలకు తాగునీటి కోసం ఎన్నేఎస్పీ నీటి సరఫరా విభాగం ట్యాంకు ను నిర్మించింది. దాహం తీర్చుకోవడానికి ఈ ట్యాంకు వద్దకు వచ్చిన కోతులు అందులోకి దిగినట్లు స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. అందులోకి దిగిన ఆ కోతులు బయటకు వచ్చే అవకాశం లేక అందులోనే పడి మృత్యువాత పడ్డాయి. అలా ఏకంగా 30 కోతులు ఆ వాటర్ ట్యాంక్ లో పడి మృతి చెందారు.

బుధవారం ట్యాంకు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు మున్సిపల్ సిబ్బందికి  సమాచారం  ఇచ్చారు.  స్థానికులు  ఇచ్చిన సమాచారంలో వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకున్న మున్సిపల్ సిబ్బంది ట్యాంక్ ను పరిశీలించగా.. అందులో కోతుల కళేబరాలు కనిపించాయి.  సుమారు 30 కోతుల వరకు  ట్యాంక్ నుంచి బయటకు తీశారు. ఇన్ని  రోజులూ ఆ నీటినే తాగమని, ఏమైనా అనారోగ్య సమస్యలు తలెత్తు అవకాశం ఉందేమేనని కాలనీ వాసులు భయాందోళనకు గురువుతున్నారు. ఎండ తీవ్రత కారణంగా నీళ్లు తాగేందుకు వచ్చిన కోతులు ట్యాంక్‌లోకి దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెంది ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ట్యాంక్‌లో మూడు రోజుల క్రితం కోతులు పడి మృతి చెందినా.. ఆ విషయాన్ని గమనించని సిబ్బంది ఆ నీటిని కాలనీకి సరఫరా చేసినట్లు తెలుస్తోంది. ట్యాంక్‌ను పరిశీలించకపోవడం, శుభ్రం చేయకపోవడం వల్లే అందులో కోతులు పడిన విషయాన్ని గుర్తించలేకపోయారని  స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఫైరయ్యారు.  నిర్లక్ష్యం వహించి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన నీటి సరఫరా విభాగం వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి