iDreamPost

పుట్టిన 72 రోజుల్లోనే 31 పత్రాలు సాధించి.. చిన్నారి ప్రపంచ రికార్డు!

పుట్టిన 72 రోజుల్లోనే 31 పత్రాలు సాధించి.. చిన్నారి ప్రపంచ రికార్డు!

సాధారణంగా గుర్తింపు పత్రాలు సంపాదించాలంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇటీవల ఆన్ లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత కొన్ని వెసులుబాట్లు ఉన్నా.. ముఖ్యమైన పత్రాల పొందాలంటే గవర్నమెంట్ ఆఫీస్ గడప తొక్కాల్సిందే. ఇక అధికారులు చుట్టు తిరిగి అలిసిపోయే వాళ్లు ఎంతోమంది ఉంటారు. కానీ ఓ మూడు నెలల చిన్నారి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 31 పత్రాలు సాధించి ప్రపంచ రికార్డు కైవసం చేసుకుంది. అంతచిన్న పాపకు అన్ని పత్రాలు ఎలా సాధించింది.. ఇంతకీ ఆ పాప ఏ ప్రాంతానికి చెందింది అని అనుకుంటున్నారా? పూర్తి వివరాల్లోకి వెళితే..

కొంతమంది చిన్నారులు పుట్టగానే వార్తల్లో నిలుస్తుంటారు. అలా పుట్టిన 72 రోజుల్లోనే 31 పత్రాలు సాధించి ఓ చిన్నారి ఏకంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. మధ్యప్రదేశ్ ఛింద్ వాఢాకు చెందిన 3 నెలల పాప ఈ ఘనత సాధించడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్ ఛింద్‌వాఢా రె చెందిన కేసరి నందన్ సూర్యవన్షి, ప్రియాంక సూర్యవన్షి తపాలా శాఖలో ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. వీరికి మూడు నెలల క్రితం శరణ్య సూర్యవన్షి అనే పాప జన్మించింది. తమ పాప పుట్టుక ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉండాలని తల్లిదండ్రులు భావించారు. ఈ క్రమంలోనే గుర్తింపు పత్రాలకు సంబంధించిన రికార్డు గురించి విన్నారు. 28 పత్రాలతో ఓ చిన్నారిపై గుర్తింపు ఉన్నట్లు తెలుసుకున్నారు. ఆ రికార్డు బ్రేక్ చేయడానికి తమ కూతరు శరణ్యకు గుర్తింపు పత్రాలు సంపాదించే పనిలో పడ్డారు తల్లిదండ్రులు.

A baby world book records

శరణ్య సూర్యవన్షి పుట్టిన 72 రోజుల్లో ఏకంగా 31 గుర్తింపు పత్రాలను సాధించిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నారు. ఆ తర్వాత వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో దరఖాస్తున్న చేయగా అందులోనూ చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా శరణ్య తల్లిదండ్రులు మాట్లాడుతూ.. మా పాప వయసు ఇప్పుడు 3 నెలలు.. తనకు ఇప్పటి వరకు 33 గుర్తింపు పత్రాలు ఉన్నాయి. పాస్ పోర్ట్, ఆధార్, సమగ్ర ఐడీ, కుల, నివాస, వ్యాక్సినేషన్ కార్డు, నేషనల్ హెల్త్ కార్డు, సుకన్య సమృద్ది యోజన, బ్యాంక్, పోస్టాఫీస్ ఖాతాలు ఉన్నాయి. ఏటీఎం, పీపీఎఫ్ ఇలా పరకాల గుర్తింపుపత్రాలు కలిగి ఉందని.. ఈ ప్రక్రియ నిరంతంర కొనసాగుతూనే ఉంటుందని, శరణ్యకు మరికొన్ని పత్రాల కోసం దరఖాస్తు చేస్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. శరణ్య సూర్యవన్షి తాత గోపాల్ సూర్యవన్షి కూడా తపాలా శాఖలో పనిచేస్తున్నారు. సరైన పత్రాలు లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. అలాంటి వారికి అవగాహన కోసమే తాము ఈ ప్రయత్నం చేసినట్లు శరణ్య తల్లిదండ్రులు అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి