iDreamPost

జగన్‌ మాటిచ్చారు.. చేశారు..

జగన్‌ మాటిచ్చారు.. చేశారు..

మాటిచ్చాడంటే.. చేస్తాడంతే.. విశ్వసనీయతకు మారుపేరులా నిలుస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. మాట చెప్పారంటే… అది చెప్పిన సమయానికి పూర్తవ్వాల్సిందే. అందుకే జగన్‌కు ఈ పేరు. ప్రతిపక్షాలు కూడా మాట ఇచ్చాడు కదా.. తప్పాడు.. అంటూ ఆయన విశ్వసనీయతను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నాయంటే ఆ మాటకు ఎంత బలం ఉందో అర్థం చేసుకోవచ్చు.

జగన్‌ మాట ఇస్తే.. చేస్తారని మరో సారి రుజువైంది. వివిధ కారణాల వల్ల గత నెలలో పింఛన్లు ఆగిపోయిన వారికి ఈ నెల పింఛన్లు ఇచ్చారు. తాము అర్హులమేనంటూ పింఛన్‌దారులు దరఖాస్తులు పెట్టుకోగా పరిశీలించిన అధికారులు పింఛన్లను తిరిగి పునరుద్ధరించారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు అధికారులు కేవలం రోజుల వ్యవధిలో అర్హతలు పరిశీలించి పింఛన్లను పునరుద్ధరించడం విశేషం. అర్హులైన ఎవరికీ అన్యాయం జరగదని, వచ్చే నెల ఒకటో తేదీన రెండు నెలల పింఛన్‌ ఇస్తామని సీఎం జగన్‌ మాట ఇచ్చారు. ఈ మాట మేరకే రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మందికి పింఛన్లు పునరుద్ధరించారు. వారికి ఈ రోజు ఫిబ్రవరి, మార్చి రెండు నెలల పింఛను సొమ్ము 4500 రూపాయలు వాలంటీర్లు అందించారు.

ఈ రోజు ఒకటో తేదీ. అంటే ఏపీలో పింఛన్ల పండగ. ఇంటి వద్దకే వాలంటీర్లు వచ్చి పింఛన్‌ సొమ్ము అందించారు. గత నెల నుంచి ఈ కార్యక్రమం అమలవుతోంది. ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వేకువ జామునే ప్రారంభమయ్యే పింఛన్ల పంపిణీ కార్యక్రమం మధ్యాహ్నం నాటికి పూర్తవుతోంది. దాదాపు 60 లక్షల మందికి 12 విభాగాల్లో పింఛన్లు అందిస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రంలో 53.19 లక్షల పింఛన్లు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 60 లక్షలకు చేరింది. మరింత మందికి పింఛన్లు అందించాలనే లక్ష్యంతో జగన్‌ సర్కార్‌ పింఛన్‌ అర్హత నిబంధనలను సరళీకరించింది. పింఛన్‌ వయస్సును 65 ఏళ్ల నుంచి 60కి తగ్గించింది. భూమి పరిమితి ఐదెకరాల నుంచి పదెకరాలకు పెంచింది. ఫలితంగా దాదాపు ఏడు లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి