iDreamPost

అమెరికా వెళ్లిన ఇండియన్ స్టూడెంట్స్ కి షాక్.. తిప్పి పంపేస్తున్న USA!

అమెరికా వెళ్లిన ఇండియన్ స్టూడెంట్స్ కి షాక్.. తిప్పి పంపేస్తున్న USA!

ఎన్నో కలలతో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులకు చుక్కెదురైంది. దిగిన విమానాశ్రయాల నుంచే విద్యార్థులను తిరిగి ఢిల్లీకి రిటర్న్ ఫ్లైట్ లో పంపేశారు. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు మొత్తం ఒక్కరోజులో 21 మంది విద్యార్థులను డిపోర్ట్ చేశారు. అసలు ఎందుకు పంపుతున్నారో కూడా సరైన కారణం చెప్పడం లేదంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అన్నీ పత్రాలు ఉన్నా కూడా తిరిగి వెళ్లిపోవాలంటూ వెనక్కి పంపుతున్నారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది. వీసా, అన్ని పత్రాలు ఉన్నా కూడా అమెరికా అధికారులు తిరిగి ఇండియా పంపేస్తున్నారంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఒక్కరోజే 21 మంది భారతీయ విద్యార్థులను రిటర్న్ ఫ్లైట్ లో ఢిల్లీ పంపేశారు. అయితే అమెరికా అధికారులు సరైన పత్రాలు లేనందునే తిరిగి పంపేస్తున్నట్లు చెబుతున్నారు. కానీ, విద్యార్థులు మాత్రం వారి వద్ద గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సీటు, వీసా, అన్ని పత్రాలు ఉన్నా కూడా తిరిగి భారత్ పంపేస్తున్నారని వాపోతున్నారు. డిపోర్ట్ అయిన విద్యార్థులు చెప్తున్న వివరాల ప్రకారం.. విమానాశ్రయంలో దిగగానే వారిని 16 గంటలు ఒక ఇరుకు గదిలో కూర్చోబెట్టారన్నారు.

తల్లిదండ్రులతో కూడా మాట్లాడనివ్వలేదని చెబుతున్నారు. వారి సెల్ ఫోన్స్, ల్యాప్ ట్యాప్స్ సీజ్ చేశారని వెల్లడించారు. అయితే విద్యార్థుల మెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్స్ చూసి వెనక్కి పంపినట్లు తెలుస్తోంది. అట్లాంటా, శాన్ ఫ్రాన్సిస్కో, చికాగో నుంచి మొత్తం 21 మంది విద్యార్థులను వెనక్కి పంపేశారు. అమెరికా ఇమిగ్రేషన్ రూల్స్ ఎంతో కఠినంగా ఉంటాయి. ఒకసారి డిపోర్ట్ చేస్తే తిరిగి 5 ఏళ్ల వరకు అమెరికా వెళ్లేందుకు వీలుండదు. చాలా మంది ఉన్నత చదువుల కోసం ఎన్నో కలలు కని అమెరికా వెళ్లేందుకు.. మంచి ఉద్యోగాన్ని వదులుకుని, లక్షల్లో అప్పులు చేసి అమెరికా వెళ్తుంటారు. విద్యార్థులను ఇలా డిపోర్ట్ చేస్తే.. వారి కలలు, ఆశయాలపై నీళ్లు చల్లినట్లే అవుతుందని చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి