iDreamPost

హైదరాబాద్ లో 2 కోట్ల విలువైన నకిలీ సిగరెట్లు పట్టివేత

Fake Cigarettes Found In Hyderabad: హైదరాబాద్ లో నకిలీ సిగరెట్ల రాకెట్ గుట్టుని పోలీసులు రట్టు చేశారు. ఏకంగా రూ.2 కోట్ల విలువైన నకిలీ సిగరెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Fake Cigarettes Found In Hyderabad: హైదరాబాద్ లో నకిలీ సిగరెట్ల రాకెట్ గుట్టుని పోలీసులు రట్టు చేశారు. ఏకంగా రూ.2 కోట్ల విలువైన నకిలీ సిగరెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ లో 2 కోట్ల విలువైన నకిలీ సిగరెట్లు పట్టివేత

ప్రస్తుతం మనిషి ఏ వస్తువు కొనాలి అన్నా గజ గజ వణికిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే నకిలీ కేటుగాళ్లు ప్రతి వస్తువుని కల్తీ చేసేస్తున్నారు. రోజూ తాగే పాలు దగ్గర నుంచి పంచదార, కూల్ డ్రింక్స్, వంటకి కావాల్సిన సరుకులు, స్నాక్స్ ఇలా దేనినీ వదలడం లేదు. ప్రతి వస్తువుని కల్తీ చేసేసి.. నకిలీ ఉత్పత్తులను మార్కెట్లలోకి పంపుతున్నారు. ఈ కల్తీ బూతం వల్ల ఎంతో మంది ఆరోగ్యం చెడిపోతోంది. అచ్చు గుద్దినట్లు ఒరిజినల్ వస్తువులు ఉన్నట్లుగానే ఈ కల్తీ, నకిలీ వస్తువులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి సిగరెట్లు కూడా చేరాయి. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున నకిలీ సిగరెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సాధారణంగా సిగరెట్లు తాగద్దు ప్రాణాలు పోతాయి అని చెప్తూనే ఉంటారు. కానీ, ఎంతో మంది ఆ మాటను బేఖాతరు చేసి తాగేస్తూ ఉంటారు. ఆ పెట్టె మీద కూడా నన్ను తాగద్దు అని రాసే ఉంటుంది. అయితే అసలు సిసలు సరుకు తాగితేనే ప్రాణాలు పోతాయి అంటే.. ఇప్పుడు ఆ సిగరెట్లలో నకిలీవి తోడయ్యాయి. తాము కాల్చే సిగరెట్ అసలో, నకిలీనో తెలియకుండానే ఎంతో మంది ప్రాణాలను ప్రమాదాల్లోకి నెట్టేసుకుంటున్నారు. తాగేది ఒరిజినల్ అయితే పదేళ్లకు మూలన పడితే.. ఈ నకిలీ సిగరెట్లు తాగితే ఇంకా ముందే మంచాన పడే అవకాశం ఉంది. తాజాగా హైదరాబాద్ లో ఎస్ఓటీ పోలీసులు ఏకంగా రూ.2 కోట్ల విలువైన నకిలీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ పోలీసులు ఈ నకిలీ సిగరెట్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో నకిలీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. పాట్నా నుంచి ఈ నకిలీ సిగరెట్లు తెప్పించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో బీహార్ కు చెందిన నలుగురిని అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నకిలీ సిగరెట్ల విలువ రూ.2.15 కోట్ల వరకు ఉంటుందని చెప్పుకొచ్చారు. డిటర్జెంట్ పేరిట ఈ నకిలీ సిగరెట్లను రవాణా చేస్తున్నారు. బిల్స్ కూడా ఫోర్జరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరిపై పలు సెక్షన్లలో కేసు నమోదు చేయనున్నారు. నాన్ బెయిలబుల్ కిందే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

ఈ నకిలీ సిగరెట్లకు సంబంధించి పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేయనున్నారు. అసలు ఈ నకిలీ సరుకు ఎక్కడికి వెళ్తోంది? అసలు వీటిని ఎవరు తెప్పిస్తున్నారు? ఎవరు వీటిని సప్లయ్ చేస్తున్నారు? అనే కోణాల్లో లోతుగా దర్యాప్తు చేయనున్నారు. ఈ సరుకు మొత్తం ఒక లొకేషన్ కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి పలు వాహనాల్లో హోల్ సేల్ మార్కెట్లకి తరలిస్తారని భావిస్తున్నారు. అక్కడి నుంచి రిటైల్ షాప్స్ వాళ్లకి ఈ నకిలీ సిగరెట్లు వెళ్లే ఛాన్స్ ఉంది. వీటి గురించి తెలిసి కొంతమంది, తెలియకుండానే కొంత మంది వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ నకిలీ సిగరెట్ల రాకెట్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ధూమపాన ప్రియులను బెంబేలెత్తిస్తోంది. మరి.. రూ.2 కోట్ల విలువైన నకిలీ సిగరెట్ల పట్టివేతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి