iDreamPost

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి 10 ప్రధానమైన కారణాలు ఇవే!

Congress's Victory In Telangana: తెలంగాణ కాంగ్రెస్ హస్తగతం అయింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దాాదాపు పదేళ్ల తరువాత కాంగ్రెస్ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే ఇంతటి ఘన విజయం కాంగ్రెస్ అందుకోవడానికి ప్రధానంగా పది కారణాలు ఉన్నాయి. అవి ఏమిటంటే..

Congress's Victory In Telangana: తెలంగాణ కాంగ్రెస్ హస్తగతం అయింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దాాదాపు పదేళ్ల తరువాత కాంగ్రెస్ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే ఇంతటి ఘన విజయం కాంగ్రెస్ అందుకోవడానికి ప్రధానంగా పది కారణాలు ఉన్నాయి. అవి ఏమిటంటే..

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి 10 ప్రధానమైన కారణాలు ఇవే!

నెల రోజుల పాటు సాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఆదివారం వెలువడిన ఫలితాలతో ఎవరు గెలుస్తారా అనే  ఉత్కంఠకు తెరపడింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ తెలంగాణను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. హ్యాట్రిక్ విజయం సాధించాలని ఆశపడిన బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే చాలా స్థానంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దాదాపు పదేళ్ల తరువాత కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అయితే ఈ పదేళ్లలో కాంగ్రెస్ అనేక ఆటుపోటులు ఎదుర్కొన్ని నేడు విజయం సాధించింది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకు కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా 10 కారణాలు కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించాయి.

2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.  ఆ సమయంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ  తరువాత జరిగిన 2018 ముందస్తు ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్  ఘన విజయం సాధించింది. ఈ రెండు సందర్భాల్లో కాంగ్రెస్ కు నిరాశే ఎదురైంది. అంతేకాక కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. ఇలా కాంగ్రెస్ తెలంగాణలో పూర్తిగా తుడిచి పెట్టుకుపోయే స్థితి చేరింది. అయితే  అధికార పార్టీ చేసిన కొన్ని తప్పులు, కాంగ్రెస్ రచించిన వ్యూహాలు ఫలించి.. 2023ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ముఖ్యంగా కాంగ్రెస్ విజయానికి పది ప్రధాన కారణాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..

BRS పార్టీపై వ్యతిరేకత:

బీఆర్ఎస్ పార్టీ  పదేళ్ల పాటు అధికారంలో ఉంది. ఏ పార్టీ అయినా సుధీర్ఘ కాలం పాటు అధికారంలో ఉంటే.. ప్రజా వ్యతిరేకత అనేది సర్వసాధారణం. అదే విధంగా తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీపై ప్రజలల్లో వ్యతిరేకత వచ్చింది. ఆపార్టీ నేతలు అవినీతికి పాల్పడ్డారని ఎక్కువ మంది ప్రజలు నమ్మారు. అంతేకాక అన్ని వర్గాల నుంచి మోజార్టీ ప్రజల్లో బీఆర్ఎస్ పై వ్యతిరేత ఏర్పడింది. దాదాపు పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై చాలా మంది ప్రజల్లో అసంతృప్తిగా ఉన్నారు. అదే ప్రస్తుతం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. అధికార పార్టీ బీఆర్ఎస్ పై వ్యతిరేకత కాంగ్రెస్ గెలుపుకు ఓ కారణమైంది.

అందరికి అందని సంక్షేమ పథకాలు:

బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు బాగానే ఉన్నప్పటికీ.. అవి అందని వారిలో అసంతృప్తి ఏర్పడింది. ముఖ్యంగా దళిత బంధువు కేసీఆర్ కొంప ముంచిందని చాలా మంది అభిప్రాయా పడుతున్నారు. అంతేకాక పథకాలు అందించే విషయంలో డబ్బులు తీసుకున్నారనే టాక్ వినిపించింది. అదే ప్రజల్లో అధికార బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తి చేసింది. ఇదే సమయంలో కాంగ్రెస్ గెలుపుకి మరో కారణం.

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు:

కాంగ్రెస్ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది.. ఆరు గ్యారెంటీలు. తాము అధికారంలోకి వస్తే.. ఆరు గ్యారెంటీ పథకాలను పక్కా అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా పెంపు, గ్యాస్ సిలిండర్ తగ్గింపు, మహిళకు ఆర్థిక భరోసా వంటి వాటితో పాటు పలు సంక్షేమ పథకాలను కాంగ్రెస్ మేనిఫోస్టోలో ప్రకటించింది. ఈ ఆరు గ్యారెంటీలు ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి. ఇవే కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించాయి.

ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్:

కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవటంలో కాంగ్రెస్ విజయం సాధించిందని చెప్పొచ్చు. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని బీఆర్ఎస్ సంప్రాదాయక ఓటు బ్యాంక్ ను తమవైపుకు తిప్పుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. రెండు పడకల ఇళ్ల విషయాన్ని ప్రధాన అస్త్రంగా తీసుకుంది కాంగ్రెస్. ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు లేదని, రెండు పడకల ఇండ్లు లేని ఊళ్లు వేలాదిగా ఉన్నాయనే విషయాన్ని కాంగ్రెస్ ప్రధానంగా ప్రస్తావించింది.

మైనార్టీలను ఆకట్టుకోవడం:

తెలంగాణలో మైనార్టీల ఓట్లు కూడా కీలకమనే విషయం అందిరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మైనార్టీ డిక్లరేషన్ ద్వారా ఆ వర్గాలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కేటే వ్యాఖ్యలు చేసి.. వాటిని కాంగ్రెస్  బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది.

రేవంత్ రెడ్డి వ్యూహాలు:

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. వాటిని అధికమించి.. అధికార పార్టీపై విమర్శన అస్త్రాలను సంధించారు. అంతేకాక ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగట్టి..ప్రజల్లోకి తీసుకెళ్లడంతో రేవంత్ సక్సెస్ అయ్యారు. అదేవిధంగా బీఆర్ఎస్ లోని అసంతృప్తులను ఆకట్టుకోవడంలో రేవంత్ విజయం సాధించారు. అదే సమయంలో తన పార్టీలోని రెబల్స్ ను బుజ్జగించి.. అందరిని ఓకే తాటిపైకి తీసుకొచ్చాడు. ఇలా రేవంత్ వేసిన వ్యూహాలు కాంగ్రెస్  గెలుపుకు ఒక కారణం.

BJP నిర్ణయాలు:

కీలకమైన ఎన్నికల సమయంలో బీజేపీ అధిష్టానం తెలంగాణలో తమ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను మార్చి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించారు. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం కూడా కాంగ్రెస్ కు కాస్త అనుకూలంగా మారిందని చెప్పొచ్చు. బండి సంజయ్ మార్పును కూడా బీఆర్ఎస్, బీజేపీ కుట్రలో భాగంగా తీసుకున్న నిర్ణయమని ప్రజలకు కాంగ్రెస్ గట్టిగా చెప్పగలిగింది. ఈ విషయంపై ప్రజల్లో చర్చ జరిగేలా చేసింది. అదే చివరకు కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించింది.

భట్టి విక్రమార్క పాదయాత్ర:

కాంగ్రెస్ సీనియర్ నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క పాదయాత్ర  చేసిన విషయం తెలిసిందే. ఖమ్మం మొదలు పలు ప్రాంతాల్లో భట్టి సుధీర్ఘ పాదయాత్ర చేశారు. అదే సమయంలో బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగిందంటూ ప్రజలల్లో తీసుకెళ్లారు. అంతేకాక నిరాశలో ఉన్న కాంగ్రెస్ కు తన పాదయాత్రలో కొత్త జోష్ ఇచ్చారు. ఇలా భట్టి చేసిన పాదయాత్రతో కాంగ్రెస్ విజయంలో కీలక భూమిక పోషించిందనే చెప్పొచ్చు. ఇదే సమయంలో అగ్రనేతల వరుస సభలు, పర్యటనలు కూడా కాంగ్రెస్ పార్టీలో మరింత జోష్ ను పెంచింది.

పార్టీనే నమ్ముకున్న సీనియర్లు:

2014 నుంచి దాదాపు పదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారానికి దూరమైంది.  ఆ సమయంలో సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ, సునీత లక్ష్మారెడ్డి వంటి సీనియర్లు చాలా మంది కాంగ్రెస్ ను వదలి వివిధ పార్టీలో చేరారు. కానీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ,జానా రెడ్డి, జీవన్  రెడ్డి , పొన్నం ప్రభాకర్ వంటి సీనియర్ నేతలు పార్టీకి అండగా నిలబడ్డారు. ప్రలోభాలకు గురికాకుండా పార్టీనినే నమ్ముకుని పార్టీకి అండగా ఉన్నారు. పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. నేడు కాంగ్రెస్ విజయం సాధించింది అంటే.. అలాంటి సీనియర్లు పార్టీనే నమ్ముని ఉండటం కూడా ఒక కారణం.

ప్రజల్లోకి బలంగా వెళ్లిన నినాదం:

కాంగ్రెస్ విజయంలో .. ఆ పార్టీ తీసుకున్న నినాదనం కీలక పాత్ర పోషించింది. మార్పు రావాలి.. కాంగ్రెస్ రావాలి అంటూ ఆ పార్టీ నేతలు అందుకున్న నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఐదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు, కొత్త పించన్లు మంజూరు చేయకపోవడాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి బాగా తీసుకెళ్లింది. అలానే అధికార పార్టీ చేసిన అవినీతి ఇది అంటూ వివిధ అంశాలను ప్రస్తావిస్తూ.. తాము చేపట్టే పథకాలను ప్రజలకు చేరావేస్తూ.. మార్పు రావాలి అంటే కాంగ్రెస్ రావాలని క్షేత్ర స్థాయిలోకి బలంగా తీసుకెళ్లారు. అదే తెలంగాణ కాంగ్రెస్ హస్తగతం కావడానికి మరో కారణం.

 సునీల్ వ్యూహాలు:

కాంగ్రెస్ ప్రచార వ్యూహకర్త  సునీల్ కానుగోలు నేతృత్వంలో చేసిన క్యాంపెయినింగ్ కాంగ్రెస్ సక్సెస్ లో కీ రోల్ పోషించింది. ఆయన చేపట్టిన డిజిటల్ క్యాంపెయినింగ్ లో కాంగ్రెస్ విజయం సాధించింది. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో విజయం అయింది. బ్లూప్రింట్ వీడియోలు, మీమ్‌లు, GIF ,పోస్టర్‌లతో కూడిన విపరీతమైన ప్రచారంతో, బీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేయగలిగింది. అతడి వ్యూహాలు కూడా కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించాయి. అగ్రనేతల వరుస సభలు, పర్యటనలు కూడా కాంగ్రెస్ పార్టీలో మరింత జోష్ ను పెంచింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి