iDreamPost

సర్దార్ రిపోర్ట్

సర్దార్ రిపోర్ట్

దీపావళికి మూడు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ కు సందడి వచ్చేసింది. రెండు తెలుగు స్ట్రెయిట్, రెండు తమిళ డబ్బింగ్, ఒక హాలీవుడ్ మూవీతో టికెట్ కౌంటర్ల వద్ద భారీ సందడిని ట్రేడ్ ఆశించింది. ఆ స్థాయిలో కాకపోయినా ఓ మాదిరి ఓపెనింగ్స్ ఉదయం కనిపించాయి. టాక్ ని బట్టి సాయంత్రానికి హెచ్చుతగ్గులు మొదలయ్యాయి. కార్తీ సర్దార్ వీటిలో ఒకటి. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్స్ తో పాటు విభిన్నమైన కథలను ఎంచుకుంటాడనే పేరున్న కార్తీకి ఇక్కడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే పొన్నియన్ సెల్వన్ 1లో పెరఫార్మన్స్ కు మంచి మార్కులు కొట్టేసిన కార్తీకి సర్దార్ సక్సెస్ చాలా కీలకం. బొమ్మ ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం

కథ 80 దశకంలో మొదలవుతుంది. తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో బోస్(కార్తీ)దేశం కోసం రహస్య గూఢచారిగా పని చేస్తుంటాడు. స్వంత కుటుంబ సభ్యులకు సైతం ఆ విషయం తెలియదు. ఒక మిషన్ కోసం ఉన్నతాధికారిని చంపేసి విదేశీ జైల్లో ముప్పై ఏళ్ళకు పైగా మగ్గుతాడు. దేశద్రోహిగా ముద్రపడిన బోస్ అలియాస్ సర్దార్ కొడుకే ఇప్పటి పోలీస్ ఆఫీసర్ విజయ్(కార్తీ). వన్ ఇండియా వన్ వాటర్ పేరుతో పది లక్షల కోట్ల నీళ్ల వ్యాపారాన్ని టార్గెట్ చేసిన ఒక కార్పొరేట్ దిగ్గజం(చుంకీ పాండే)ఆగడాలను అడ్డుకునేందుకు సర్దార్ జైలు నుంచి తప్పించుకుని బయటికి వస్తాడు. తండ్రిని అప్పటిదాకా అపార్థం చేసుకున్న విజయ్ అతనితో కలిసి శత్రువుల ఆట కట్టిస్తాడు.

సర్దార్ పూర్తిగా కార్తీ వన్ మ్యాన్ షో. అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో కట్టిపడేసాడు. ముఖ్యంగా వయసు మళ్ళిన క్యారెక్టర్ లో ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చే ఎన్నో మూమెంట్స్ ఉన్నాయి. ప్లాస్టిక్ బాటిల్స్ తో చేసే వాటర్ బిజినెస్ వల్ల ఎంత ప్రమాదం పొంచి ఉందో చెప్పే ప్రయత్నాన్ని దర్శకుడు పీఎస్ మిత్రన్ బాగానే చేశారు కానీ మొదటి అరగంట, ఎక్కువ నిడివి, పాటలు, కొంచెం ఓవర్ డోస్ వెళ్లిన యాక్షన్ ఎపిసోడ్స్ కొంత చికాకు పెడతాయి. వాటిని మినహాయిస్తే సర్దార్ యాక్షన్ లవర్స్ ని పూర్తిగా సంతృప్తి పరుస్తుంది. ఆ మధ్య వచ్చిన విక్రమ్ కోబ్రాలో మిస్ అయిన అంశాలన్నీ సర్దార్ లో బాగా కుదిరాయి. స్పై వ్యవస్థపై వచ్చిన సినిమాల్లో సర్దార్ కు ఖచ్చితంగా స్థానం ఇవ్వొచ్చు. జివి ప్రకాష్ బిజిఎం ఇంకొంచెం బెటర్ గా ఉంటే సర్దార్ స్థాయి పెరిగేది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి