iDreamPost

అదిపురుష్ వాయిదా.. తెరవెనుక కథ..!

అదిపురుష్ వాయిదా.. తెరవెనుక కథ..!

భయపడినంతా అయ్యింది. వందల కోట్ల బడ్జెట్ తో రూపొంది రాముడిగా ప్రభాస్ ని సరికొత్తగా చూపిస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న అదిపురుష్ సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంది. యూనిట్ అధికారికరంగా ప్రకటించకపోయినా నార్త్ డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాణ సంస్థ ముందుగానే సమాచారం ఇవ్వడంతో ఇది కాస్తా బయటికి వచ్చేసింది. తిరిగి ఎప్పుడు రిలీజ్ చేస్తారనే క్లారిటీ లేదు. ఒకవేళ సలార్ కనక సెప్టెంబర్ లో రాలేని పరిస్థితులు నెలకొంటే అప్పుడు అదిపురుష్ తేదీ నిర్ణయించే అవకాశం ఉంది. 2023 వేసవిని మంచి సీజన్ గా భావిస్తున్నారని ఇన్ సైడ్ టాక్.అప్పుడు సాధ్యపడకపోతే వచ్చే ఏడాది ఇది లేదా సలార్ ఏదో ఒకటి మాత్రమే థియేటర్లకు వస్తుంది.

అసలీ పోస్ట్ పోన్ కి పలు కారణాలున్నాయి. మొదటిది సంక్రాంతి క్లాష్,  వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిల మీద ఆడియన్స్ లో చాలా బజ్ ఉంది. అసలే మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్లు. ఏ మాత్రం క్లిక్ అయినా బిసి సెంటర్స్ లో పూనకాలే. వాటి మీద అదిపురుష్ వెళ్తే ఓపెనింగ్స్ తో పాటు కలెక్షన్లను పంచుకోవాల్సి ఉంటుంది. అంత బడ్జెట్ పెట్టినప్పుడు క్లాష్ ఎంత మాత్రం సేఫ్ కాదు. పైగా తమిళనాడులో విజయ్ వారసుడు, అజిత్ తునివు హడావిడి మాములుగా లేదు. అక్కడ స్క్రీన్లనీ వీళ్ళిద్దరికే చాలవు. అలాంటప్పుడు ఆది పురుష్ ఎంత గ్రాండ్ గా ఉన్నా అరవ జనాలు పట్టించుకోరు. పైగా తెలుసున్న రామాయణ కథ కాబట్టి ఎగ్జైట్ మెంట్ ఉండదు.

ఈ పరిణామాల కన్నా ముందు టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి దర్శకుడు ఓం రౌత్ తో పాటలు టీమ్ ఆందోళన చెందిన మాట వాస్తవం. విజువల్ ఎఫెక్ట్స్ గురించి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎంత మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అయినా మరీ ఇంత కృత్రిమంగా పాత్రలు ఎలా డిజైన్ చేస్తారని విమర్శకులు విరుచుకుపడ్డారు. త్రీడి చూడమని కొన్ని థియేటర్లలో స్పెషల్ ప్రీమియర్లు వేసినా లాభం లేకపోయింది. అందుకే నలుగురుని ఢీ కొట్టి రిస్కు తీసుకోవడం కన్నా ఏదైనా మంచి టైంలో సోలోగా వస్తే కలిగే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. చేతిలో తగినంత సమయం దొరకడంతో విఎఫెక్స్ క్వాలిటీ మీద మరింత ఫోకస్ పెట్టొచ్చు. కృతి సనన్ సీతగా సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించిన అదిపురుష్ ఇతర క్యాస్టింగ్ ని పూర్తిగా రివీల్ చేయలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి