iDreamPost

Zomato Delivery Boy: పేరుకే డెలివరీ బాయ్.. ఇద్దరి ప్రాణాలు నిలబెట్టి దేవుడయ్యాడు!

ఓ యువకుడు ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేస్తూ ఎంతో మంది ఆకలి తీర్చాడు. అలానే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఇద్దరికి ఊపిరి పోసి ఆ యువకుడు దేవుడయ్యాడు. కానీ అతడి కుటుంబంలో మాత్రం విషాదం నింపాడు.

ఓ యువకుడు ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేస్తూ ఎంతో మంది ఆకలి తీర్చాడు. అలానే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఇద్దరికి ఊపిరి పోసి ఆ యువకుడు దేవుడయ్యాడు. కానీ అతడి కుటుంబంలో మాత్రం విషాదం నింపాడు.

Zomato Delivery Boy: పేరుకే డెలివరీ బాయ్.. ఇద్దరి ప్రాణాలు నిలబెట్టి దేవుడయ్యాడు!

మరణం అనేది మూడు అక్షరాల పదమే. కానీ ఇది మిగిల్చే గుండెకోత  గురించి వర్ణించడం చాలా కష్టం. మరణం అనేది తథ్యమని తెలిసిన మనిషి..పేగు బంధాలతో పేన వేసుకుని ఉంటాడు. ఈ మృత్యువు అనేది ఎప్పుడూ ఏ రూపంలో వస్తుందే చెప్పలేము. కొందరికి ముందుగానే కొన్ని సంకేతాలు ఇస్తూ చావు పలకరిస్తుంది. కానీ మరికొందరి విషయంలో మాత్రం మృత్యువు.. పాము కాటేసినట్లు అకస్మాత్తుగా సంభవిస్తుంది. ఇలా నిత్యం ఎంతో మంది వివిధ కారణాలతో మరణిస్తుంటారు. అయితే తాజాగా ఓ డెలివరీ బాయ్..ప్రాణాలతో పోరాడుతున్న ఇద్దరికి ఊపిరి పోశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఓ యువకుడు చదువుకుంటూనే మరోవైపు పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ కుటుంబానికి ఆర్థికంగా చేదోడు నిలుస్తున్నాడు. అయితే అలా హాయిగా సాగిపోతున్న వారి కుటుంపై విధి కన్నేర్ర చేసింది. ఆ యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కంబలించింది. తాను గెలిచానని తెగ విర్రవీగింది మృత్యువు. అయితే ఆ  చావునే ఓడించేలా.. ఆ యువకుడి తల్లిదండ్రులు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ, రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలం వట్టి నాగుల పల్లి గ్రామానికి చెందిన బిశ్వాల్ ప్రభాస్ అనే 19 ఏళ్ల యువకుడు తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ప్రభాస్ తో పేద కుటుంబం కావడంతో ఆర్థిక సమస్యలు ఉండేవి. తాను బాగా చదివి కుటుంబానికి మంచి స్థితిలోకి తీసుకెళ్లాలని  ప్రభాస్ భావించాడు. అలానే ఇంటర్ పూర్తి చేసి.. ప్రస్తుతం స్థానిక కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు.

Delivery Boy

చదువుతూనే కుటుంబానికి ఆర్థికంగా చేయుతా ఇవ్వలేని ప్రభాస్ భావించాడు. అందుకే ఓ వైపు చదువు కుంటునే మరోవైపు పార్ట్ టైమ్ జాబ్ చేసేవాడు. పార్ట్ టైమ్ ఉద్యోగం కింద ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ అయినా జుమాటోలో ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. అలా ఉన్నతంలో ఆ కుటుంబం సంతోషంగా  సాగిపోతుంది. అలానే తమ కుమారుడు బాగా చదువుకుని భవిష్యత్ లో ఉన్న స్థితికి వెళ్తాడని ఆ తల్లిదండ్రులు భావించారు. అయితే వారు ఒకటి తలిస్తే విధిఒకటి తలచింది. ఈనెల 14వ తేదీన బిశ్వాశ్ ప్రభాస్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.

తీవ్రంగా గాయపడిన బిశ్వాల్ ను దగ్గరలోని ఓ  కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి పరిశీలించిన వైద్యులు.. బ్రెయిన్ డెడ్ అయింది అతడి తల్లిదండ్రులకు తెలియజేశారు. కొన ఊపిరితో ఉన్న బిశ్వాల్ ను కాపాడటం కష్టమని వైద్యులు తెలిపారు. ఇదే సమయంలో అవయవదానం గురించి బిశ్వాశ్ తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో  వారు తమ కుమారుడు అవయవదానం చేసేందుకు అంగీకరించారు. బిశ్వాశ్ ప్రాణాలు పోతునే ఇద్దరికి ఊపిరి పోశాడు. అలా తాను మరణించి కూడా ఇద్దరి రూపంలరో అమరుడై బతికే ఉంటాడని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. మరి..ఈ యువకుడి విషాద గాథపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి