iDreamPost

సర్వేల్లో YCP ప్రభంజనం.. మళ్ళీ జగనే CM! ఇవిగో అసలు లెక్కలు!

  • Published Mar 01, 2024 | 1:36 PMUpdated Mar 01, 2024 | 4:26 PM

జనాలతో పాటు సర్వే సంస్థలన్ని.. ఏపీలో మళ్లీ జగనే సీఎం అని నొక్కి వక్కాణిస్తున్నాయి. తాజాగా మరో రెండు సర్వే సంస్థలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఆ వివరాలు..

జనాలతో పాటు సర్వే సంస్థలన్ని.. ఏపీలో మళ్లీ జగనే సీఎం అని నొక్కి వక్కాణిస్తున్నాయి. తాజాగా మరో రెండు సర్వే సంస్థలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఆ వివరాలు..

  • Published Mar 01, 2024 | 1:36 PMUpdated Mar 01, 2024 | 4:26 PM
సర్వేల్లో YCP ప్రభంజనం.. మళ్ళీ జగనే CM! ఇవిగో అసలు లెక్కలు!

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. నవరత్నాల పేరుతో బడుగు, బలహీన వర్గాల వారి కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు సీఎం జగన్‌. లబ్ధిదారుల ఖాతాకే నేరుగా నగదు బదిలీ చేస్తూ.. ఎక్కడా అవినీతికి పాల్పడకుండా.. ఎంతో నిజాయితీగా పాలన చేపడుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో సుమారు 98 శాతం వాటిని అమలు చేస్తూ.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు సీఎం జగన్‌.

ప్రజల్లో ఆయనకు పెరుగుతున్న ఫాలోయింగ్‌ చూసి విపక్షాలకు కంటి మీద కునుకు కరువయ్యింది. జగన్‌ ఒక్కడిని ఓడించడం కోసం విపక్షాలన్ని ఏకమయ్యాయి. అయితే ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన జగనే మా నెక్స్ట్‌ సీఎం అంటున్నారు జనాలు. ఇప్పటికే అనేక సర్వే సంస్థలు ఏపీలో మళ్లీ వైసీపీ జెండానే ఎగురుతుంది అని స్పష్టం చేస్తుండగా.. తాజాగా రెండు ప్రముఖ సర్వే సంస్థలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. ఆ వివరాలు..

ఏపీ ఎన్నికల ఫలితాల గురించి ఇప్పటికే అనేక సర్వేలు.. మళ్లీ జగనే సీఎం అని నొక్కి వక్కానిస్తుండగా.. తాజాగా మరో రెండు సర్వే సంస్థలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. రానున్న ఎన్నికల్లో మరోసారి జగనే సీఎం అని సదరు సర్వే సంస్థలు కుండబద్దలు కొట్టాయి. రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనాలు వైసీపీకే మరోసారి పట్టం కట్టనున్నారని జీన్యూస్‌ మ్యాటరైజ్‌ ఒపినీయన్‌ పోల్‌ తేల్చి చెప్పింది. దీని ప్రకారం రానున్న లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీకి 19, టీడీపీ కూటమికి 6 ఎంపీ సీట్లు వస్తాయని వెల్లడించింది. అలానే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 125, టీడీపీ కూటమికి 50 అసెంబ్లీ సీట్లు వస్తాయని ఈ సర్వే వెల్లడించింది. అంతేకాక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలు కనీసం ఖాతా కూడా తెరవవని జీ మ్యాటరైజ్‌ ఒపినీయన్‌ పోల్‌ స్పష్టం చేసింది.

అలానే జనాధార్‌ ఇండియా సర్వే ఆధారంగా.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీకి 125 సీట్లు వస్తాయని.. అలానే టీడీపీ కూటమికి 50 అసెంబ్లీ సీట్లు అవకాశాలున్నాయని వెల్లడించింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 49.2 శాతం ఓట్లు.. టీడీపీ కూటమికి 46.3 శాతం ఓట్లు వస్తాయని జనాధార్‌ సర్వే అంచనా వేస్తుంది. అలానే ఈ ఎన్నికల్లో బీజేపీకి 1.1 శాతం, కాంగ్రెస్‌కు 1.3 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది. ఇక జనాధార్‌ అంచనా ప్రకారం లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీకి 17, టీడీపీ కూటమికి 8 ఎంపీ సీట్లు వస్తాయి. లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఖాతాలు తెరవ్వని ఈ సర్వే స్పష్టం చేసింది.

ఇక సీఎం వైఎస్‌ జగన్‌ పని తీరు బాగుందని ప్రజలు చెబుతున్నారని ఆసంస్థలు పేర్కొన్నాయి. జగన్‌ పని తీరు బాగుందని దాదాపు 62 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. జగన్‌ సర్కార్‌ అందిస్తోన్న సంక్షేమ పథకాల పట్ల తాము సంతృప్తిగా ఉన్నామని జనాలు చెబుతున్నారని ఈ సర్వే సంస్థలు వెల్లడించాయి. సర్వేలన్నీ జగనే మళ్లీ సీఎం అంటుండడంతో.. విపక్షాల్లో ఒణుకు మొదలయ్యింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి