iDreamPost

టెక్నాలజీనే కాదు.. పదాలను సృష్టించడంలోనూ బాబు దిట్ట: విజయసాయి రెడ్డి

తాజాగా అలాంటి అస్త్రమే అధికార పార్టీ వైసీపీకి దొరికింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి కేంద్ర ఐటీ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. రూ.118 కోట్ల వ్యవహారంలో చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది.

తాజాగా అలాంటి అస్త్రమే అధికార పార్టీ వైసీపీకి దొరికింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి కేంద్ర ఐటీ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. రూ.118 కోట్ల వ్యవహారంలో చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది.

టెక్నాలజీనే కాదు.. పదాలను సృష్టించడంలోనూ బాబు దిట్ట: విజయసాయి రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం వేడీ మీద ఉంది.  అధికార, ప్రతి పక్షాలు మాటల ఆస్త్రాలను పరస్పరం స్పందించుకుంటున్నారు. ఎవరికి ఏ చిన్న అవకాశం దొరికిన ప్రత్యర్థిపై విరుచుకపడుతున్నారు. తాజాగా అలాంటి అస్త్రమే అధికార పార్టీ వైసీపీకి దొరికింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి కేంద్ర ఐటీ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. రూ.118 కోట్ల వ్యవహారంలో చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. దీంతో వైసీపీ మంత్రులు, ఇతర ముఖ్యనేతలపు చంద్రబాబుపై సెటైర్లు, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా వైసీపీ పార్లమెంట్ సభ్యులు విజయ సాయిరెడ్డి చంద్రబాబుపై సెటైర్లు వేశారు.

కోటి రూపాయలు అంటే ‘టన్ను స్టీల్ ’ అనే పదానికి సృష్టికర్త చంద్రబాబేనని విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు. వాడుకలో ఉన్న కొత్తపదాలను గుర్తించి ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ ఏటా నిఘంటువులో చేరుస్తుందని ఆయన తెలిపారు. అలానే కోటి రూపాయలంటే ఒక ‘టన్ను స్టీల్’ అనే పదాన్ని కూడా చేర్చాలని ఉత్సాహవంతులైన యువత ఆక్స్‌ఫర్డ్‌కు మెయిల్స్ మీద మెయిల్స్ పెడుతున్నారని పరోక్షంగా సెటైర్లు వేశారు. ఇలా ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించి నవ్వులు పూయించారు. ఒక వేళ ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో ఈ పదం చేరితే.. ఆ క్రెడిట్ చంద్రబాబుదేనని ఆయన అన్నారు. కొత్త టెక్నాలజే కాదు, కొత్త పదాలు కూడా సృష్టించడంలో చంద్రబాబు దిట్ట అని సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

వాడుకలో ఉన్న కొత్తపదాలను గుర్తించి ఆక్సడిక్షనరీ ఏటా నిఘంటువులో చేరుస్తుంది. కోటి రూపాయలంటే ఒక ‘టన్ను స్టీల్’ అనే పదజాలాన్ని కూడా చేర్చాలని ఉత్సాహవంతులైన యువతీ, యువకులు ఆక్స్ ఫర్డ్ కు మెయిల్స్ మీద మెయిల్స్ పెడుతున్నారట. ఆ క్రెడిట్ కూడా బాబు గారికే దక్కుతుంది.  ‘స్టీల్ టన్నుల’ పేరుతో షాపూర్జీ నుంచి నేరుగా రూ.18.93 కోట్లు, బోగస్ కంపెనీలు హయగ్రీవకు రూ.11.12 కోట్లు, శకలక, అన్నైకి రూ. 33.76, ఎవరెట్, నయోలిన్ లకు రూ.50.43, పౌర్ ట్రేడింగ్ రూ. 9.42, ఫొనిక్స్ కు రూ.18.14, లక్ స్టోన్ కు 1.23, దుబాయిలో దినార్ల రూపంలో అందినవి 15.13 కోట్లు. ఈ వివరాలు ఫేక్ అని చెప్పే దమ్ముందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మరి.. చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి